నాగ్ ఆశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రాజెక్ట్ కే భారీ బడ్జెట్ తో ఈసినిమా తెరకెక్కుతుంది. అత్యంత భారీ బడ్జెట్‌తో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. ఇక ఈసినిమాను నాగ్ అశ్విన్ ఏ రేంజ్ లో తెరకెక్కిస్తున్నాడో ఇటీవలే ఈసినిమా కోసం వాడే ఒక టైర్ మేకింగ్ కు సంబంధించి ఒక వీడియో ను చూస్తే అర్థం చేసుకోవచ్చు. ఆ చిన్న గ్లింప్స్ తో సినిమాపై అంచనాలను మరింత పెంచేశాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా మొదలుపెట్టినప్పుడే అమితాబ్ కు సంబంధించి కొంత వరకూ షూటింగ్ ను కూడా పూర్తి చేసుకున్నారు. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ శరవేగంగా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. ఇక ఈమధ్య ఈసినిమా షూటింగ్ సమయంలో బిగ్ బీ గాయపడిన సంగతి తెలిసిందే కదా. ఇప్పుడిప్పుడే ఆయన కోలుకుంటున్నారు.
ఈనేపథ్యంలోనే ఈసినిమా షూటింగ్ పై పలు వార్తలు తెరపైకి వస్తున్నాయి. అమితాబ్ గాయం అవ్వడంతో షూట్ బ్రేక్ ఇచ్చినట్టు వార్తలు మొదలవ్వడంతో తాజాగా షూట్ పై అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ప్రస్తుతం అయితే అమితాబ్ లేకుండానే షూటింగ్ జరుగుతుందని.. బిగ్ బీ ప్రస్తుతం కోలుకుంటున్నారు.. కోలుకున్నాక షూటింగ్ లో పాల్గొంటారని.. ఈగ్యాప్ లో వేరే పోర్షన్స్ ను పూర్తి చేస్తున్నామని క్లారిటీ ఇచ్చారు.
కాగా ఈసినిమాలో బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తుండగా..దిషా పఠాని కూడా నటిస్తుంది. వైజయంతి మూవీస్ బ్యానర్ పై ప్రభాస్ రేంజ్‌కి తగ్గట్టుగా నిర్మాత అశ్వినీదత్ ఈ చిత్రాన్ని పాన్ వరల్డ్ రేంజ్ లో భారీ బడ్జెట్‌తో రూపొందించనున్నారు. మిక్కీ జే మేయర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. సంక్రాంతి కానుకగా 2024 జనవరి 12న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: