హోంబలే ఫిల్మ్స్ బ్యానర్పై స్వీయ దర్శకత్వంలో కన్నడ హీరో రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన కాంతార కన్నడ మూవీ సెప్టెంబర్ 30వ తేదీన రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో కిషోర్, అచ్యుత్ కుమార్, సప్తమి గౌడ, ప్రమోద్ శెట్టి కీలక పాత్రలలో నటించారు. బి .అజనీష్ లోకనాథ్ సంగీతం అందించారు. కాంతార మూవీ అన్ని భాషలలోనూ అద్భుత రెస్పాన్స్ సాధించిన విషయం తెలిసిందే. కాంతార మూవీ ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లు పైగా కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ మూవీపై ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. కాంతార మూవీకి ఓటీటీ లో కూడా అద్భుత స్పందన లభిస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
స్విట్జర్లాండ్ లో జెనీవాలో ఉన్న యూరప్ దేశాల ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో కాంతార సినిమా స్క్రీనింగ్ జరుగనుంది. ఈ శుక్రవారం ఈ సినిమా స్క్రీనింగ్ కోసం రిషబ్ శెట్టి ఇప్పటికే స్విట్జర్లాండ్ కు వెళ్లారు. ఐరాస లో ప్రదర్శించబోతున్న మొదటి కన్నడ సినిమా కాంతార నే. కాంతార సినిమాలో అడవుల పరిరక్షణ.. అటవీ ప్రాంతం పై ఆధారపడి జీవించే గిరిజనుల యొక్క సమస్యల గురించి ఐక్యరాజ్య సమితి లో రిషబ్ శెట్టి మాట్లాడబోతున్నారు. కాంతార సినిమా ప్రతి దేశంలో ఉన్న సమస్యలపై చిత్రీకరించిన సినిమా అవ్వడం వల్ల అక్కడ ప్రదర్శించబోతున్నారు. సౌత్ సినిమాకి దక్కిన గొప్ప గౌరవంగా దీన్ని సినీ ప్రముఖులు అభివర్ణిస్తున్నారు.
Proud to represent ECO FAWN in submitting Oral Statement at UNHRC. The significance in promotion of cultural rights of forest dwellers and protection of forests in Kantara is deciphered at the international forum. pic.twitter.com/1sAz2dTbqg
— Rishab Shetty (@shetty_rishab) March 16, 2023
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: