ఎన్టీఆర్ నుండి అది దొంగతనం చేస్తా

Rana About Jr NTR For Linguistic Skills

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఉన్న ప్రత్యేకమైన టాలెంట్ గురించి ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికీ అలానే తెలుగు ప్రేక్షకులు అందరికీ తెలుసు. అతని డిక్షన్ కానీ డైలాగ్ డెలివరీకి గాను సాటి లేదు. ఎంత పెద్ద డైలాగ్, అలానే ఎన్ని పేజీల డైలాగులు అయినా గుర్తుపెట్టుకొని సింగిల్ టేక్ లో చెప్పగలిగే టాలెంటెడ్ యాక్టర్ అని ఇప్పటికే ఎంతో మంది చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అంతేకాదు వేరే భాషలను సైతం తొందరగా నేర్చుకునే టాలెంట్ ఉంది తారక్ కు. ఈనేపథ్యంలోనే ఎన్టీఆర్ నుండి ఆ టాలెంట్ ను దొంగతనం చేస్తా అంటున్నారు మరో టాలెంటెడ్ హీరో రానా.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రానా నుండి రీసెంట్ గా వచ్చిన వెబ్ సిరీస్ రానా నాయుడు. ఈ వెబ్ సిరీస్ రే డోనోవన్ ఆధారంగా తెరెక్కింది. ఇక ఇక్కడ ఈ సిరీస్ లో వెంకటేష్, రానా ఇద్దరూ నటించారు. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రానాను టాలీవుడ్ హీరోలు రామ్‌చరణ్, ప్రభాస్, ఎన్టీఆర్ నుంచి ఏం దొంగతనం చేయాలనుకుంటున్నారు అని అడుగగా దానికి రానా.. చరణ్ నుండి ఇతరులకి సాయం చేసే గుణం.. ప్రభాస్ నుంచి అతని చెఫ్‌, అతని ఫుడ్‌ని తీసుకోవాలనుకుంటున్నా అని తెలిపాడు. ఇక ఎన్టీఆర్ గురించి చెబుతూ.. ఎన్టీఆర్‌ నుంచి భాష నేర్చుకునే నైపుణ్యాన్ని దొంగతనం చేయాలనుకుంటున్నా. ఎన్టీఆర్ భాషనైనా చాలా ఈజీగా నేర్చుకుంటాడు. చైనీస్ భాషని సైతం 20 నిమిషాల్లో నేర్చుకుని మాట్లాడే టాలెంట్ తారక్‌కి ఉంది. తనకి తెలుగుతో పాటు కన్నడ, తమిళం, హిందీ వంటి పలు భాషలు వచ్చు అంటూ చెప్పుకొచ్చాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 2 =