ఊహలు గుస గుసలాడే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నాగశౌర్య మొదటి సినిమాలోనే తన ఎనర్జిటిక్ నటనతో ఆకట్టుకొని హిట్ ను అందుకున్నాడు. ఇక అప్పటినుండి విభిన్నమైన కథలను ఎంచుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం తన నుండి వస్తున్న సినిమా ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి. శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా ఈసినిమా వస్తుంది. ఇంకా ఒక్క రోజులో ఈసినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇప్పిటికే ఈసినిమాపై మంచి బజ్ ను క్రియేట్ చేశారు.
ఈనేపథ్యంలో ఈసినిమా నుండి వచ్చిన టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఫ్రెష్ కంటెంట్ తో వస్తున్నట్టు టీజర్ తో అర్థమైంది. ఇక పాటలు కూడా మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటున్నాయి. తాజాగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ట్రైలర్ తో సినిమాపై మరింత ఆసక్తిని పెంచారు. ఏజ్ కు తగినట్టుగా హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ ఏ విధంగా ఉండబోతుందో అని సినిమాలో చూపించనున్నట్లు ట్రైలర్‌తోనే స్పష్టం చేశారు. కళ్యాణి మాలిక్ నేపథ్య సంగీతం మంచి ఫీల్‌ను కలిగిస్తుంది. ముఖ్యంగా సునీల్ కుమార్ సినిమాటోగ్రఫి చాలా బాగుంది. మొత్తంగా ప్రేమ, పెళ్లి, అలకలు, బుజ్జగింపులను కలుపుకుంటూ వెళ్లే కథలా ఈ సినిమా కనిపిస్తోంది. మరి ఈసినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే రిలీజ్ వరకూ ఆగాల్సిందే.
Experience the Drizzle in this hot summer😍💞#PAPA Release Trailer out now🤩
Watch Trailer 👇 https://t.co/0b9JUuJflO#PAPAFromMarch17
Book your Tickets🎟https://t.co/Y4NEIpGQW2@IamNagashaurya @iamMalavikaNair#SrinivasAvasarala @vishwaprasadtg@vivekkuchibotla… https://t.co/w3QuHAqN9E pic.twitter.com/HTI8F8rXUY
— People Media Factory (@peoplemediafcy) March 16, 2023
కాగా ఈసినిమాలో నాగశౌర్యకు జోడీగా మాళవిక హీరోయిన్ గా నటిస్తుంది. గతంలో నాగశౌర్యతో కలిసి ‘కళ్యాణ వైభోగమే సినిమా చేయగా ఇప్పుడు ఈసినిమాలో మరోసారి జతకడుతుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్ పై టి.జి.విశ్వప్రసాద్, దాసరి పద్మజ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సునీల్ కుమార్ సినిమాటోగ్రఫి అందిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: