క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా శాకుంతలం. ఈ సినిమా శకుంతల, దుష్యంతుల ప్రేమ కావ్యంగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది ఈసినిమా. ఇక పోస్ట్ ప్రొడక్షన్ పనులు లేట్ అవ్వడంతో గత నెలలో విడుదల కావాల్సిన ఈ సినిమా వచ్చే నెలలో రాబోతుంది. ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు, టీజర్, ట్రైలర్ అన్నీ సినిమాపై అంచనాలను పెంచేసింది. దానికితోడు ఈసినిమా ఫస్ట్ కాపీ చూసి తన రివ్యూను సైతం ఇచ్చేసి సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచేసింది సమంత. ఇక ఇప్పుడు మరోసారి ఈసినిమా గురించి తన ట్విట్టర్ లో ఆసక్తికర ట్వీట్ చేసింది సామ్. నాకు చిన్నప్పటి నుంచి డిస్నీ మూవీస్ అంటే ఇష్టం. అలాంటి సినిమాలో నటించాలనే కల ఉండేది. తాజాగా ‘శాకుంతలం’ సినిమాను వీక్షించాను. సినిమా చూస్తున్నంత సేపు నా కల నెరవేరిన అనుభూతి కలిగింది అంటూ ట్వీట్ లో పేర్కొంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
🫶🏻#Shaakuntalam on April 14th!!
The little girl in me is screaming with joy.. loved Disney films all my life and finally to be a part of something that looks and feels so Disney.. dream come true!!#ShaakuntalamDiaries https://t.co/pkFTxNuPwK— Samantha (@Samanthaprabhu2) March 15, 2023
కాగా ఈసినిమాలో దేవ్ మోహన్ దుష్యంతుడి పాత్రలో నటిస్తుండగా.. అదితి బాలన్ అనసూయగా, మోహన్ బాబు మహర్షి, అల్లు అర్హ ప్రిన్స్ భరత్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాను గుణశేఖర్ తన స్వంత బ్యానర్ గుణ టీమ్ వర్క్స్ పతాకంపై నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ఈసినిమాను కూడా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాను మొత్తం 5 భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. విజువల్ వండర్‌గా త్రీడీ టెక్నాలజీతో తెలుగు, హిందీ, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో శాకుంతలం సినిమా విడుదలవుతుంది. ఏప్రిల్ 14న 2D, 3D వెర్షన్స్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: