ఫలానా అమ్మాయి ఫలానా అబ్బాయి ఎందుకు చూడాలంటే ..

Reasons To Watch Phalana Abbayi Phalana Ammayi Movie

చాలా రోజుల నుండి ఓ సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు యంగ్ హీరో నాగశౌర్య. ఈ హీరో నటించిన తాజా చిత్రం ‘ఫలానా అమ్మాయి ఫలానా అబ్బాయి’. శ్రీనివాస్ అవసరాల దర్శకుడు, మాళవిక నాయర్ హీరోయిన్. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోవడంతో సినిమా కు మంచి హైప్ వచ్చింది. ఈ శుక్రవారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాను ఎందుకుచుడాలో ఇప్పుడు తెలుసుకుందాం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సినిమాను చాలా రియలిస్టిక్ గా తెరకెక్కించాడు దర్శకుడు శ్రీనివాస్ అవసరాల. ఇక్కడే సినిమా చాలా వరకు సక్సెస్ అయినట్లే. ఇద్దరి ప్రేమికుల మధ్య జరిగే సంఘర్షణనే ఈసినిమా. దాన్ని వాస్తవానికి దగ్గర చూపించాడు. ఎంటర్టైన్మెంట్ ,ఎమోషన్స్ పర్ఫెక్ట్ గా మిక్స్ చేసి సినిమాను తీర్చిదిద్దాడు. అలాగే మ్యూజిక్ కూడా సినిమాకు ప్లస్ అయ్యింది.ఈ సినిమా కోసం కథలో భాగంగా నాగ శౌర్య 7 డిఫరెంట్ లుక్స్ తో కనిపించనున్నాడు.

ఇక సినిమాలో మరో హైలైట్ లీడ్ పెయిర్ కెమిస్ట్రీ. నాగశౌర్య, మాళవిక నాయర్ జంట చాలా ఫ్రెష్ గా అనిపిస్తుంది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా చక్కగా కుదిరింది. ఇక ఇది రొమాంటిక్ ఎంటర్ టైనర్ కాబట్టి సినిమాలో లీడ్ పెయిర్ ఎందుకు విడిపోవాల్సి వచ్చింది వాళ్ళ మధ్య వచ్చిన కాన్ఫ్లిక్ట్ ఏంటి అలాగే చివరకు ఇద్దరు కలిసారా అనేది కూడా చాలా ఆసక్తిగా ఉండనుంది. సో వీటికోసం ఈసినిమాను తప్పకుండా చూడాల్సిందే.

ఇదిలావుంటే ఈ సినిమాకు మరో ప్లస్ పాయింట్ ఏంటంటే డైరెక్టర్ మరియు హీరోది బ్లాక్ బాస్టర్ కాంబినేషన్ కావడమే. ఇంతకుముందు వీరి కాంబినేషన్ లో వచ్చిన ‘ఊహలు గుసగుసలాడే , జ్యో అచ్యుతానంద’ బ్లాక్ బాస్టర్ అయ్యాయి. ఇప్పుడు ఫలానా అమ్మాయి ఫలానా అబ్బాయి తో నాగశౌర్య ,అవసరాల శ్రీనివాస్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయంగా కనిపిస్తుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ,దాసరి ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈసినిమాను నిర్మించగా కళ్యాణి మాలిక్ సంగీతం అందించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − eighteen =