ఇండస్ట్రీ తోపాటు సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం దసరా. పాన్ ఇండియా మూవీ గా వస్తున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు వున్నాయి. ఇక కొద్దీ సేపటి క్రితం ఈసినిమా ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ కూడా అంచనాలకు తగ్గకుండా వుంది. ట్రైలర్ చూస్తుంటే ఊర మాస్ లుక్ తో తెలంగాణ స్లాంగ్ లో నాని అలాగే పక్కా పల్లెటూరి అమ్మాయి పాత్రలో కీర్తి సురేష్ నటన మెప్పించడం ఖాయంగా కనిపిస్తుంది. బొగ్గు గనుల నేపథ్యంలో రివేంజ్ స్టోరీ బ్యాక్ డ్రాప్ తో శ్రీకాంత్ ఓదెల ఈచిత్రాన్ని తెరకెక్కించాడు. అతనికి ఇదే మొదటి సినిమా.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కామెడీ, లవ్, యాక్షన్ ,ఎమోషన్స్ అన్ని మిక్స్ చేసి ట్రైలర్ ను కట్ చేశారు. ఈ ట్రైలర్ లో నాని డైలాగ్స్ , యాక్షన్ సన్నివేశాలు , విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్ అయ్యాయి. మొత్తానికి ట్రైలర్ ఎక్కడా డిస్సపాయింట్ చేయలేదు. సినిమాను కూడా ఇదే విధంగా హై మూమెంట్స్ తో నింపేస్తే బ్లాక్ బాస్టర్ అవ్వడం ఖాయం. కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణ్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. సాయికుమార్, సముద్రఖని ,దీక్షిత్ శెట్టి, పూర్ణ తదితరులు కీలకపాత్రల్లో కనిపించనుండగా ఈ చిత్రం నెల 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.
దసరా ట్రైలర్:
ఇక ఈ సినిమాతో నాని కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. సోలో గా రిలీజ్ అవుతుండడం అలాగే సినిమాపై భారీ అంచనాలు ఉండడం తో ఓపెనింగ్స్ అదిరిపోనున్నాయి. ఇక హిట్ టాక్ వస్తే ఈచిత్రంతో నాని 100కోట్ల మైలు రాయిని ఈజీగా చేరుకోనున్నాడు. మరి ఈ సినిమా అంచనాలను అందుకుంటుందో లేదో చూడాలి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: