డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా భారీ బడ్జెట్, భారీ తారాగణంతో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా రౌద్రం రణం రుధిరం మార్చి 25వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవవిజయం సాధించి భారీ కలెక్షన్స్ సాధించింది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, గోండు వీరుడు కొమురం భీమ్ గా ఎన్టీఆర్ తమ పవర్ ఫుల్ యాక్టింగ్ టాలెంట్ తో ప్రేక్షకులను అలరించారు. హాలీవుడ్ ప్రముఖులు ప్రశంసలు కురిపించిన ఆర్ఆర్ఆర్ మూవీ పలు ఇంటర్ నేషనల్ అవార్డ్స్ అందుకుంటున్న విషయం తెలిసిందే. ఆర్ఆర్ఆర్ మూవీలోని నాటు నాటు పాట, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డ్స్ కు నామినేట్ అయ్యింది. మార్చి 12, 2023 న ఆస్కార్ అవార్డు వేడుక జరుగనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ వేడుకల కోసం ఆర్ఆర్ఆర్ టీమ్ అక్కడికి చేరుకుంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా సౌత్ ఏషియన్ ఎక్సలెన్స్ సెలబ్రేషన్స్ పేరిట ఆస్కార్ 2023 లో నామినేట్ అయిన సౌత్ ఏషియన్స్ కోసం నిర్వహించిన కార్యక్రమంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో పాటు నాటు నాటు సాంగ్ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన అభిమాన యంగ్ టైగర్ తో కలిసి దిగిన పిక్ ని పోస్ట్ చేసి ,ఎంత ఎదిగినా ఎంతో ఒదిగి ఉండే మంచి వ్యక్తిత్వం గల తారక్ అన్నతో ఈ సెలబ్రేషన్స్ లో పిక్ దిగడం ఎంతో ఆనందంగా ఉందని రాహుల్ ట్వీట్ చేశారు. ఆ సూపర్ పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: