హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా కొత్త రకం సినిమాలు చేయడానికి టాలీవుడ్ నైట్రో స్టార్ సుధీర్ బాబు ఎప్పుడూ ముందుంటాడు. రీసెంట్ గా హంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సుధీర్ బాబు ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. . ప్రముఖ నటుడు, రచయిత హర్షవర్ధన్ దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా వస్తున్న సినిమా మామా మశ్చీంద్ర. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంటూనే మరోపక్క ఈసినిమా ప్రమోషన్స్ ను మొదలుపెట్టారు చిత్రయూనిట్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమాలో సుధీర్ మూడు డిఫరెంట్ షేడ్స్ లో కనిపించనున్న సంగతి తెలిసిందే కదా. దీనిలో భాగంగానే ఈ లుక్స్ ను ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే రెండు లుక్ లను రిలీజ్ చేశారు మేకర్స్. లావుగా ఉన్న దుర్గ క్యారెక్టర్ పోస్టర్ ను అలానే గ్యాంగ్‌స్టర్ లా ఉన్న పరశురామ్ క్యారెక్టర్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇప్పుడు తాజాగా మూడో లుక్ ను కూడా రిలీజ్ చేశారు. మూడో పాత్ర డీజే ని పరిచయం చేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. మరి ఇందులో సుధీర్ బాబు తన ఒరిజినల్ లుక్ లో మంచి స్టైలిష్ గా పర్ఫెక్ట్ డీజే లా అయితే కనిపిస్తున్నాడు.
కాగా ఈసినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పి బ్యానర్ పై నారాయణ్ దాస్ కె నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు నిర్మిస్తున్నారు. చైతన్య భరద్వాజ్ సంగీతం అందిస్తున్న ఈసినిమాకు పీజీ విందా సినిమాటోగ్రఫి అందిస్తున్నాడు. ఇక ఈసినిమాను తెలుగుతో పాటు హిందీ లో కూడా రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: