గత ఏడాది బంగార్రాజు, థ్యాంక్యూ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య ఈ ఏడాది కస్టడీతో వస్తున్నాడు. నాగచైతన్య హీరోగా తమిళ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో చేస్తున్న సినిమా కస్టడీ. ఈసినిమాలో చైతు పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమాను తెలుగు తో పాటు తమిళ్ లో కూడా చిత్రీకరిస్తున్నారు. ఈసినిమా షూటింగ్ రీసెంట్ గానే కంప్లీట్ అయిన సంగతి తెలిసిందే కదా. ఇక పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా మొదలుపెట్టేశారు. ఈసినిమా నుండి వరుసగా పోస్టర్లను రిలీజ్ చేస్తూ వస్తున్నారు మేకర్స్. ఇక తాజాగా ఓ అప్ డేట్ఇచ్చారు చిత్రబృందం. ఈసినిమాలో చైతు తన పాత్రకు సంబంధించిన షూటింగ్ ను మొదలుపెట్టేశాడు. ఈ విషయాన్ని చిత్రయూనిట్ తెలియచేస్తూ చైతు డబ్బింగ్ చెబుతున్న పోస్టర్ ను రిలీజ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా బంగార్రాజు సినిమా తరువాత మరోసారి చైతూ తో కృతి శెట్టి కలిసి నటిస్తుంది. అరవింద్ స్వామి విలన్ పాత్రలో నటిస్తుండగా, ప్రియమణి పవర్ ఫుల్ పాత్రలో కనిపించనుంది. సంపత్ రాజ్, శరత్ కుమార్, ప్రేమ్ జీ, వెన్నెల కిషోర్, ప్రేమి విశ్వనాథ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్స్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: