పెళ్లి చూపులు సినిమాలో తన కామెడీ టైమింగ్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రియదర్శి. ఆ ఒక్క సినిమాతో ప్రియదర్శికి వరుస అవకాశాలు వెల్లువెత్తాయి. ఇక ప్రస్తుతం అయితే ప్రియదర్శి పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఒకవైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూనే మరోపక్క హీరోగా పలు సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు ప్రియదర్శి ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా బలగం. ఈసినిమా మార్చి 3వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు, టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. రీసెంట్ గానే ట్రైలర్ ను రిలీజ్ చేయగా ట్రైలర్ కూడా సినిమాపై అంచనాలను పెంచేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా రేపు విడుదలవుతున్న నేపథ్యంలో మేకర్స్ సర్ ప్రజింగ్ అప్ డేట్ ఇచ్చారు. ఈసినిమా టికెట్ ప్రైజ్ ను తగ్గిస్తూ అప్ డేట్ ఇచ్చారు. తక్కువ ప్రైజ్ లో మంచి ఎక్స్ పీరియన్స్ ఇచ్చే సినిమా.. ఏపీ ఇంకా తెలంగాణ రెండు రాష్ట్రాల్లోని మల్టీ ప్లెక్సుల్లో రేపు 112 రూపాయలకు టికెట్ ను బుకింగ్ చేసుకోండి అంటూ తమ నిర్మాణ సంస్థ ద్వారా తెలియచేశారు.
Takkuva prices lo manchi experience iche cinema 😀❤️
Book your tickets now for only Rs.112 at any multiplex across AP/Telangana on march 3rd.#Balagam ✨
🎟️ https://t.co/BaqGYW1CdI
🎟️ https://t.co/i0PGXKWUzN#BalagamOnMarch3rd @offlvenu @priyadarshi_i @kavyakalyanram pic.twitter.com/NM5tWJ4Qej— Sri Venkateswara Creations (@SVC_official) March 2, 2023
కాగా వేణు దర్శకత్వం వహిస్తున్న ఈసినిమాలో కావ్యా కల్యాణ్‌రామ్, సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, జయరాం, విజయలక్ష్మీ, స్వరూప కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దిల్ రాజు సమర్పణలో వస్తున్న ఈసినిమాకు హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. భీమ్స్ సంగీతం అందిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: