రీసెంట్ గా ఒకే ఒక జీవితం మూవీతో హీరో శర్వానంద్ సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే. శర్వానంద్ ఇప్పుడు మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్ బ్యానర్ పై శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా కామెడీ, యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఒక మూవీ తెరకెక్కనుంది. ఈ మూవీలో కథానాయికగా కృతి శెట్టి ఎంపిక అయ్యారు. కృతి శెట్టి గ్లామర్ పార్ట్ కే పరిమితం కాకుండా.. ఈసినిమాలో మంచి పెర్ఫామెన్స్ రోల్ లో నటిస్తున్నట్టు సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యి ప్రస్తుతం హైదరాబాద్ లో చిత్రీకరణ జరుపుకుంటుంది. సినిమాలో ఎక్కువ భాగం లండన్‌లో షూట్ చేయనుండగా, యూరప్‌లోని కొన్నిప్రాంతాల్లో కూడా షూటింగ్ కు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. హీరో నాగచైతన్య, కృతి శెట్టి జంటగా తెరకెక్కిన కస్టడీ మూవీ సమ్మర్ కానుకగా మే 12 వ తేదీ రిలీజ్ కానుంది. అజయంతే ర్యాండమ్ మోషణం మూవీతో కృతిశెట్టి మలయాళ చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: