ముగిసిన తారకరత్న అంత్యక్రియలు

Taraka Ratna Funeral Completed at Maha Prasthanam,Actor Taraka Ratna Passed Away,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood News,Taraka Ratna No More,Taraka Ratna Passed Away,Taraka Ratna RIP,Taraka Ratna Passes Away,Hero Taraka Ratna Passes Away,Taraka Ratna Latest News,Taraka Ratna Live News

సినీ పరిశ్రమల్లో అతి తక్కువ వయసులో హీరోలు చనిపోవడం ఎంతో కలిచివేస్తుంది. ఆ మధ్య కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో చనిపోయారు. ఇంకా ఎంతో మంది నటీ నటులు చనిపోయారు. ఇక ఇప్పుడు అతి తక్కువ వయసులోనే నందమూరి తారకరత్న చనిపోవడం అనేది సినీ పరిశ్రమను కలచివేస్తుంది. లోకేష్ మొదలుపెట్టిన ‘యువగళం’ పాదయాత్ర కార్యక్రమంలో తారకరత్న పాల్గొన్నారు. అదే రోజు గుండెపోటుకు గురయ్యారు. ఈనేపథ్యంలో మొదట కుప్పంలో చికిత్స అందించగా.. అనంతరం బెంగుళూరు లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తూ వచ్చారు. దాదాపు మూడు వారాలకు పైగా డాక్టర్లు మెరుగైన వైద్యం అందిస్తూ వచ్చారు. అయినా కూడా పరిస్థితి విషమించడంతో మొన్న మరణించారు. ఆయన మృతి పట్ల అందరూ విచారం వ్యక్తం చేస్తున్నారు. సినీ ఇండస్ట్రీ మొత్తం తరలివచ్చి తారకరత్నకు ఘన నివాళులు అర్పిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక నేడు తారకరత్న అంత్యక్రియలు నిర్వహించారు కుటుంబసభ్యులు. నందమూరి సోదరలతో పాటు బాలకృష్ణ కూడా తారకరత్న పాడెని మోశారు. మహా ప్రస్థానంలో తారకరత్న అంత్యక్రియలు ముగిశాయి. తండ్రి మోహనకృష్ణ చేతుల మీదుగా కుమారుడికి అంతిమ సంస్కారాలు పూర్తయ్యాయి. మహాప్రస్థానంలో అంత్యక్రియలకు చంద్రబాబునాయుడు, విజయసాయిరెడ్డి, లోకేశ్, జూనియర్ ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్ తో పాటు వేలాదిగా అభిమానూలు, తెదేపా కార్యకర్తలు పాల్గొన్నారు.

కాగా నందమూరి వారసత్వంతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నటుల్లో తారకరత్న కూడా ఒకరు. ఒకటో నంబర్ కుర్రాడు అనే సినిమాతో 2002 లో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఆ సినిమా మంచి విజయాన్నే అందించింది. ఇక ఆతరువాత ‘యువరత్న’, ‘తారక్’, ‘భద్రాది రాముడు’, ‘నందీశ్వరుడు’ వంటి సినిమాల్లో నటించారు. ప్రస్తుతం అయితే ఆయన సినిమాలకు దూరంగానే ఉన్నారు. కానీ అప్పుడప్పుడు పలు సినిమాల్లో నటిస్తూ కనిపిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × three =