అఖిల్ ఊచకోత- మ్యాచ్ తారకరత్నకు అంకితం

Akhil Dedicated his win to Taraka Ratna,Akhil Wins The First Match For Telugu Warriors In CCL 2023 With His Masterclass Batting,Akhil Dedicated His Win to Taraka Ratna,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood News,Akhil,Akhil Latest News,Akhil New Movie News,Akhil Latest Film Details,Akkineni Akhil Dedicated His Win to Taraka Ratna,Akkineni Akhil Dedicated His Win to Nandamuri Taraka Ratna,Taraka Ratna Latest News,Taraka Ratna News,Akhil,Taraka Ratna

అక్కినేని వారసత్వంలో మూడో జనరేషన్ హీరో అఖిల్. ఇక అఖిల్ సినిమా రంగంలోకి అడుగుపెట్టక ముందు నుండే క్రికెట్ బాగా ఆడతాడన్న సంగతి తెలిసిందే కదా. అఖిల్ కి క్రికెట్ లో మంచి నైపుణ్యం ఉంది. ప్రస్తుతం సిసిఎల్ మ్యాచ్ లు జరుగుతున్నాయి. రాయ్ పూర్ లో నిన్న తెలుగు వారియర్స్, కేరళ స్ట్రైకర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో అఖిల్ బౌండరీల వర్షం కురిపించాడు. కేవలం 30 బంతుల్లోనే 91 పరుగులు సాధించి తన జట్టుని గెలిపించాడు. ఈ మ్యాచ్ లో అఖిల్ కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఇక ఈ మ్యాచ్ ను తారకరత్నకు అంకితం ఇస్తున్నట్టు అఖిల్ తన ట్విట్టర్ ద్వారా తెలియచేశాడు. దీంతో అఖిల్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు అందరూ.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రస్తుతం అఖిల్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సినిమా తరువాత వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో ఉంది. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్ బ్యాన‌ర్‌పై అనీల్ సుంక‌ర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు స్క్రీన్ ప్లే వక్కంతం వంశీ అందించాడు. థమన్ ఎస్ సంగీతం అందిస్తుండగా.. సినిమాటోగ్రాఫర్ గా రగుల్ హెరియన్ ధరుమన్ వ్యవహరిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 − two =