2018 లో జీరో సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన షారుఖ్ ఖాన్ చాలా గ్యాప్ తరువాత ఇప్పుడు పఠాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ఈసినిమా రూపొందింది. ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఇప్పుడు ఎన్నో అంచనాల మధ్య ఈసినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈసినిమా షారుఖ్ కు మంచి కమ్ బ్యాక్ సినిమా అయిందా లేదా అన్నది తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
నటీనటులు.. షారుఖ్ ఖాన్, దీపికా పదుకునే, జాన్ అబ్రహాం, అశుతోష్ రానా, డింపుల్ కపాడియా తదితరులు
దర్శకత్వం.. సిద్ధార్థ్ ఆనంద్
బ్యానర్స్.. యశ్ రాజ్ ఫిలిమ్స్
నిర్మాత.. ఆదిత్య చోప్రా
సినిమాటోగ్రఫీ: సంచిత్ పౌలోస్
సంగీతం: సంచిత్ బల్హారా, అకింత్ బల్హారా
కథ..
ఇది ముగ్గురు సీక్రెట్ ఏజెంట్ల మధ్యన జరిగే కథ. పాకిస్తాన్ కల్నల్ ఇండియా మీద ఓ అటాక్ ప్లాన్ చేస్తాడు. దాని కోసం ప్రైవేట్ ఎజెంట్ అయిన జిమ్ (జాన్ అబ్రహం) తో ఒప్పందం కుదుర్చుకుంటాడు. దీనిలో భాగంగానే రక్తబీజ్ అనే ఒక భయానకమైన వైరస్ ని క్రియేట్ చేస్తాడు. ఆ ప్లాన్ అడ్డుకునేందుకు పఠాన్ (షారుఖ్ ఖాన్) రంగంలోకి దిగుతాడు. అసలు జిమ్ చేసిన రక్త భీజ్ ప్లాన్ ఏమిటి ? ఈ మధ్యలో పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్ రూబై (దీపికా పదుకోన్) పాత్ర ఏమిటి? ఆమెకు పఠాన్ కి మధ్య ఏం జరిగింది ? చివరకు ‘పఠాన్’ జిమ్ ను ఎలా అంతం చేశాడు ? అనేది మిగిలిన కథ.
ఈమధ్య బాలీవుడ్ సినిమాల సక్సెస్ ల సంగతి పక్కన పెడితే సినిమాలకు కావాల్సినంత హైప్ మాత్రం ముందే వచ్చేస్తుంది. పాజిటివో, నెగిటివో సినిమాలకు మంచి బజ్ ను క్రియేట్ చేస్తున్నారు. ఇక పఠాన్ సినిమాకు కు కూడా కావాల్సినంత బజ్ క్రియేట్ అయింది. దానికి కారణం బేషారం పాట అని చెప్పనక్కర్లేదు. ఎన్నో వివాదల మధ్య నేడు ఈసినిమా రానే వచ్చింది. ఈసినిమా దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కింది. ఇప్పటికే దేశభక్తి నేపథ్యంలో ఎన్నో సినిమాలు వచ్చాయి.. పఠాన్ సినిమాను ఎంగేజింగ్ గా చెప్పాలనే ప్రయత్నం చేసాడు డైరక్టర్. స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమాలంటే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమా మొదలైనప్పటినుండి చివరి వరకూ బోర్ కొట్టించకుండా క్షణ క్షణం ఉత్కంఠం కలిగించేలా ఉండాలి కథ. అలా ఉంటే సినిమా హిట్టే. ఈసినిమాలో కూడా అలాంటి ట్విస్ట్ లు ఎత్తుకు పై ఎత్తులు బాగానే ఉన్నాయి. ఇంటర్ నేషనల్ లెవల్ ఈసినిమాను డైరెక్ట్ చేశాడు సిద్దార్ధ్. దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ తీసుకున్న స్టోరీ లైన్, రాసుకున్న కొన్ని సస్పెన్స్ సీక్వెన్సెస్ బాగున్నాయి.
పెర్ఫామెన్స్
షారుఖ్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏముంది. బాలీవుడ్ బాద్ షా అనే పేరు తెచ్చుకున్నాడంటేనే తన నటన ఎలా ఉంటుందో ఎప్పుడో నిరూపించేశాడు. ఇక ఈసినిమాలో కూడా షారుఖ్ ఖాన్ అద్భుతంగా నటించాడు. ముఖ్యంగా తన యాక్షన్ బాడీ లాంగ్వేజ్ తో అలాగే, కొన్ని యాక్షన్ అండ్ ఎమోషనల్ సీక్వెన్స్ స్ లో షారుఖ్ ఖాన్ నటన సినిమాకే హైలైట్ గా నిలిచింది. జాన్ అబ్రహం ఫెరఫెక్ట్ బాడీతో విలన్ గా బాగా చేసారు. పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్ గా దీపికా కూడా బాగానే నటించింది. పలు యాక్షన్ సీన్లు కూడా బాగానే చేసింది. ఇక ఈసినిమాలో మరో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ సల్మాన్ ఖాన్ అతిథి పాత్రలో కనిపించడం. ఇంటర్వెల్ తర్వాత పఠాన్ కోసం టైగర్ సల్మాన్ ఖాన్ రావటం, ఫైట్ సీక్వెన్స్ బాగున్నాయి. అలాగే సినిమా చివర్లో సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ కూర్చుని మాట్లాడుకునే సీన్ ని సైతం అభిమానులకు కిక్కిచ్చేలా చేశాడు డైరక్టర్. మిగిలిన పాత్రల్లో నటించిన అశుతోష్ రానా, డింపుల్ కపాడియా తమ పాత్రల మేర నటించారు.
టెక్నికల్ వాల్యూస్
ఇక ఇలాంటి సినిమాలకు టెక్నికల్ గా కూడా చాలా ప్రాధాన్యత ఉంటుంది. కెమెరా వర్క్, గ్రాఫిక్స్ మాత్రం అద్భుతమని చెప్పుకోవాలి. కెమెరా వర్క్ విజువల్ వండర్‌గా అనిపించేలా చేసారు. వివిధ దేశాల్లో ఈసినిమాను చిత్రీకరించగా అక్కడ విజువల్స్ ను కూడా అద్భుతంగా చూపించారు. ఇంకా హాలీవుడ్ స్థాయి యాక్షన్ సీన్స్ మాత్రం హైలెట్ గా నిలిచాయి. యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మాణ విలువలు మరోసారి తమ సత్తాని చాటాయి.
ఓవరాల్ గా చెప్పాలంటే భారీ స్థాయిలో తెరకెక్కిన ఈసినిమా బాగానే ఆకట్టుకుంటుంది అని చెప్పొచ్చు. స్టైలిష్ అండే యాక్షన్ థ్రిల్లర్ గా తీసిన ఈసినిమా యాక్షన్ సినిమాలను ఇష్టపడే వాళ్లకు అయితే యాక్షన్ ఫీస్ట్ లా అనిపిస్తుంది. అసలే షారుఖ్ నుండి సినిమా వచ్చి చాలా ఐదేళ్లు అయిపోయింది. దీంతో ఈసినిమాతో మరోసారి తన సత్తాను చూపించాడు. ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ లాంటి సినిమాను ఇచ్చాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
తెలుగు ఫుల్ మూవీస్
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.