ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో గ్రాడ్యుయేట్ అయిన శ్రీనిధి శెట్టి అందాల పోటీలలో 2015 సంవత్సరంలో మిస్ కర్ణాటక, 2016 సంవత్సరంలో మిస్ దివా సూపర్ నేషనల్, మిస్ సూపర్ నేషనల్ విన్నర్ గా నిలిచారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ హీరోగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ కె.జి.యఫ్ చాప్టర్ 1మూవీ తో శాండిల్ వుడ్ లో కెరీర్ ప్రారంభించారు. ఆ మూవీలో తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుని శ్రీనిధి శెట్టి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. శ్రీనిధి శెట్టి కథానాయికగా తెరకెక్కిన కె.జి.యఫ్ చాప్టర్ 1 మూవీ సీక్వెల్ కె.జి.యఫ్ చాప్టర్ 2 మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. చియాన్ విక్రమ్ హీరోగా తెరకెక్కిన కోబ్రా మూవీతో శ్రీనిధి కోలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయ్యారు. తాజాగా ఒక తెలుగు మూవీలో శ్రీనిధి కథానాయికగా ఎంపిక అయినట్టు సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై హిట్ సినిమాల దర్శకుడు శైలేష్ కొలను దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా ఒక మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో వెంకటేష్ కి జోడీగా శ్రీనిధి శెట్టిని ఎంపిక చేసినట్టు సమాచారం. మంచి ఫాంలో ఉన్నప్పుడు క్రేజీ కాంబినేషన్స్ కోసం ఎదురుచూస్తూ టైమ్ వేస్ట్ చేసుకోవడం కన్నా వచ్చిన అవకాశాన్ని ఉయోగించుకొనడం బెటర్ అనే ఉద్దేశంతో శ్రీనిధి ఈ మూవీ ఓకే చేసినట్టు సమాచారం.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: