దర్శకుడు జేమ్స్ కామెరాన్ దర్శకత్వంలో తెరకెక్కిన విజువల్ వండర్ అవతార్ హాలీవుడ్ మూవీ 2009 లో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి, భారీ కలెక్షన్స్ తో వరల్డ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచింది. లైట్ స్ట్రామ్ ఎంటర్‌టైన్‌మెంట్-టీఎస్‌జీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ పై జేమ్స్ కామెరాన్ దర్శకత్వంలో సామ్ వర్తింగ్టన్, జో సాల్డనా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన అవతార్ మూవీ సీక్వెల్ అవతార్ : ది వే ఆఫ్ వాటర్ మూవీ డిసెంబరు 16న విడుదల అయ్యి భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోన్న విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
దర్శకుడు జేమ్స్ కామెరాన్ దర్శకత్వంలో లియోనార్డో డికాప్రియో, కేట్ విన్స్లెట్ జంటగా అద్భుతమైన ప్రేమ కావ్యంగా తెరకెక్కిన టైటానిక్ మూవీ 1997 సంవత్సరం లో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ఈ మూవీ టాలీవుడ్ లో అద్భుతమైన వసూళ్లను రాబట్టింది. ఓ హాలీవుడ్ సినిమా టాలీవుడ్ పై ప్రభావం చూపించింది అంటే అది టైటానిక్ సినిమానే అని చెప్పొచ్చు. ఆ సినిమా రిలీజ్ అయిన టైం లో స్ట్రైట్ తెలుగు సినిమాలకు పోటీగా టైటానిక్ ఆడిందంటే ఆ సినిమా ఎంత ఇంప్యాక్ట్ క్రియేట్ చేసిందో తెలిసిందే. ఎన్నో అరుదైన రికార్డులు సాధించిన టైటానిక్ సినిమా మళ్లీ ప్రేక్షకులను అలరించడానికి వస్తుంది. 25 సంవత్సరాల తరువాత టైటానిక్ మూవీ ప్రపంచవ్యాప్తంగా 4K వర్షన్, 3Dలో ఫిబ్రవరి 10 వ తేదీన రీ రిలీజ్ కానుంది. ఈ సినిమా 3D వెర్షన్ ప్రేక్షకులను మరింత ఎంటర్టైన్ చేస్తుందని సమాచారం. టైటానిక్ సినిమా రీ రిలీజ్ అనగానే ఆ సినిమా చూసినప్పటికీ యూత్ ఆడియన్స్ కూడా మళ్లీ ఆ సినిమాను థియేటర్ లో చూడాలని ఆసక్తి చూపుతున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: