మెగస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నారు. వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. గతఏడాది ఆచార్య, గాడ్ ఫాదర్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక ఈ ఏడాది అప్పుడే మరో సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్దమయ్యారు. బాబీ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా వస్తున్న సినిమా వాల్తేరు వీరయ్య. ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమాను రూపొందించారు. ఇక ఈసినిమా నుండి వచ్చిన అప్ డేట్లు అన్నీ సినిమాపై అంచనాలను పెంచేశాయి. పాటలు ఇప్పటికే యూట్యూబ్ లో దూసుకుపోతుండగా.. ఇప్పుడు ట్రైలర్ కూడా అదే రేంజ్ లో దూసుకుపోతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాను హిందీలో కూడా రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. అయితే హిందీకి సంబంధించి ఇప్పటివరకూ ఎలాంటి అప్ డేట్ రాకపోవడంతో హీందీలో రిలీజ్ ఉంటుందా అన్న అనుమానాలు కూడా తలెత్తాయి. అయితే వాటికి బ్రేక్ వేస్తూ ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ హిందీట్రైలర్ కి కూడా ప్రస్తుతం మంచి రెస్పాన్స్ లభిస్తుంది.
Humari MEGA MASS film #WaltairVeerayya aa rahi hain, Hindi mein 💥🔥
Here’s the Hindi Trailer!
– https://t.co/fGZ56b2vdNIn cinemas from Jan 13th.
Megastar @KChiruTweets Mass Maharaja @RaviTeja_offl @dirbobby @shrutihaasan @ThisIsDSP @SonyMusicSouth pic.twitter.com/yQjwj3ISR0
— Mythri Movie Makers (@MythriOfficial) January 9, 2023
కాగా ఈ సినిమాలో చిరంజీవి సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. మాస్ మహారాజా రవితేజ ఈ సినిమాలో పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమాను మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈసినిమా సంక్రాంతి బరిలోకి దిగనుంది. జనవరి 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: