దర్శకుడు బాబీ మెగాస్టార్ చిరంజీవి కాంబినేష్ లో వస్తున్న సినిమా వాల్తేరు వీరయ్య. ఈసినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందకు రానున్నసంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం చిత్రయూనిట్ నుండి వరుసగా అప్ డేట్స్ రిలీజ్ చేస్తూ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేస్తున్నారు. పోస్టర్లు, గ్లింప్స్, పాటలు ఇలా ఒకదాని తరువాత ఒకటి రిలీజ్ చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో బాస్ పార్టీ ట్రెండింగ్‌లో ఉంది. మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంటుంది. చిరంజీవి శ్రీదేవీ సాంగ్ సైతం క్లిక్ అయింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు ఈసినిమా నుండి మరో పాటను రిలీజ్ చేశారు. ఈసినిమా టైటిల్ సాంగ్ ను నేడు రిలీజ్ చేశారు మేకర్స్. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలకు చంద్రబోస్ సాహిత్యం అందించారు. ఈ గీతాన్ని అనురాగ్ కులకర్ణి, పవిత్ర చారి ఆలపించారు. వాల్తేరు వీరయ్య టైటిల్ సాంగ్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. ఇక ఇప్పుడు ఈపాట సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుంది. దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన ఎనర్జిటిక్ సాంగ్ కి మెగాస్టార్ ని దర్శకుడు ప్రెజెంట్ చేసిన విధానం.. మొత్తంగా వింటేజ్ బాస్ ని చూస్తున్నట్టు ఉందని మెగా ఫ్యాన్స్ అయితే హ్యాపీగా ఉన్నారు. ఇక ఈపాట ప్రస్తుతం యూట్యూబ్ లో దూసుకెళుతోంది.
Rough adiddham Sankranthi ki 💥🔥💣#VeerayyaTitleSong from #WaltairVeerayya out now ❤️🔥
– https://t.co/SAX5wBmElv#WaltairVeerayyaOnJan13th pic.twitter.com/0oei0vtR3N— Mythri Movie Makers (@MythriOfficial) December 26, 2022
కాగా ఈ సినిమాలో చిరంజీవి సరసన శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తోంది. మాస్ మహారాజా రవితేజ ఈ సినిమాలో పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమాను బాబి మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించబోతున్నాడు. ఈసినిమాను మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: