మాస్ మహారాజా రవితేజకు ఎట్టకేలకు ఈ ఏడాది చివరిలో సూపర్ హిట్ ను అందుకున్నాడు. ఈఏడాది ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాగా రెండు సినిమాలూ బోల్తా కొట్టాయి. దీంతో ధమాకాతో ఎలాగైనా హిట్ కొట్టాలని ఎదురుచూశాడు. ఇప్పుడు ధమాకా తో హిట్ ను సొంతం చేసుకున్నాడు. త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వంలో మాస్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ సినిమా లో వింటేజ్ రవితేజ మార్క్ ఎంటర్టైన్మెంట్ ఉండటంతో సినిమా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంటుంది. ఇక ఈసినిమాలో నటింటిన హీరోయిన్ శ్రీలీల ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్, ఇంకా సంగీతం ఈసినిమా విజయానికి ప్రధాన బలాలు అయ్యాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈ సినిమా ఫస్ట్ షో నుంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ఈసినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. అయితే సినిమా కలెక్షన్స్ విషయంలో మాత్రం అందరి అంచనాలను దాటేస్తూ ముందుకు వెళుతుంది. ఈసినిమా రిలీజ్ అయి నాలుగురోజులు అవుతున్నా అన్ స్టాపబుల్ రాంపేజ్ ను కొనసాగిస్తుంది. ఇక నాలుగు రోజుల్లో ఈసినిమా ప్రపంచవ్యాప్తంగా 41 కోట్లను రాబట్టుకుంది. ఈ విషయాన్ని చిత్రయూనిట్ ఆనందంగా తెలియచేసింది.
MassMaharaja @RaviTeja_offl ‘s
MASSive 4️⃣ Days
Unstoppable Rampage 💥#DhamakaBlockBuster in Cinemas Now 🥳🤩#DhamakaBook your tickets nowhttps://t.co/iZ40p9utmY@sreeleela14 @TrinadharaoNak1 @vishwaprasadtg @vivekkuchibotla @KumarBezwada pic.twitter.com/oHZg2fj4W3
— People Media Factory (@peoplemediafcy) December 27, 2022
కాగా ఈసినిమాలో సచిన్ ఖేడ్కర్, రావు రమేష్, జయరామ్, తనికెళ్ల భరణి, సీత, పవిత్ర లోకేష్, సమీర్, ప్రవీణ్, హైపర్ ఆది కీలక పాత్రల్లో నటించారు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై అభిషేక్ అగర్వాల్, టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. భీమ్స్ సంగీతం అందిస్తున్న ఈసినిమాకు కార్తీక్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























