మొత్తానికి ఈ ఏడాది చివరిలో హిట్ ను అందుకున్నాడు మాస్ మహారాజా రవితేజ. ఈ ఏడాది ఇప్పటికే ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ అనే సినిమాలను రిలీజ్ చేయగా.. రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఇక నిన్న ధమాకా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రవితేజ హీరోగా వచ్చిన మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ ధమాకా నిన్న రిలీజ్ అయింది. ఇక ఈసినిమాలో ప్రేక్షకులకు కావాల్సిన అంశాలు ఉండటంతో సినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. రవితేజ కామెడీ, ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్, యాక్షన్ సీక్వెన్స్, పాటలు ఇంకా హీరో-హీరోయిన్స్ మధ్య కెమిస్ట్రీ అన్నీ సినిమాలో హెలైట్ గా నిలిచాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా హిట్ టాక్ ను సొంతం చేసుకోవడమే కాదు.. మొదటి రోజు ఈ సినిమాకు మంచి కలెక్షన్స్ వచ్చినట్టు తెలుస్తున్నాయి. ఇక ఈసినిమా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 10 కోట్లను సొంతం చేసుకుంది. మాసివ్ బ్లాక్ బస్టర్ ఎంటర్ టైనర్ గా నిలించిందని ఈవిషయాన్ని చిత్రయూనిట్ తెలిపింది. ఈ సినిమా రవితేజ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బాక్సాఫీస్ ఓపెనర్ గా నిలిచినట్లు తెలుస్తోంది.
MassMaharaja @RaviTeja_offl ‘s
MASSive Box Office Rampage 💥#DhamakaBlockBuster in Cinemas Now 🥳🤩#DhamakaBook your tickets nowhttps://t.co/iZ40p9utmY#DhamakaFromDec23@sreeleela14 @TrinadharaoNak1 @vishwaprasadtg @vivekkuchibotla @KumarBezwada pic.twitter.com/pr8bQO2z2R
— People Media Factory (@peoplemediafcy) December 24, 2022
కాగా ఈసినిమాలో సచిన్ ఖేడ్కర్, రావు రమేష్, జయరామ్, తనికెళ్ల భరణి, సీత, పవిత్ర లోకేష్, సమీర్, ప్రవీణ్, హైపర్ ఆది కీలక పాత్రల్లో నటించారు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై అభిషేక్ అగర్వాల్, టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. భీమ్స్ సంగీతం అందిస్తున్న ఈసినిమాకు కార్తీక్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: