ధనుష్ సార్ బ్యాక్ టు బ్యాక్ అప్ డేట్స్

Dhanush Sir Movie Back to Back Updates,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Dhanush,Sir,Sir Movie,Sir Telugu Movie,Sir Movie Updates,Sir Telugu Movie Latest News,Sir Movie Updates,Sir Telugu Movie Latest Updates

తమిళ్ హీరోలు ఇప్పుడు తెలుగులో కూడా సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పటివరకూ తెలుగులో డబ్బింగ్ వర్షన్ ను రిలీజ్ చేసిన హీరోలు ఇప్పుడు డైరెక్ట్ గా సినిమాలు చేస్తున్నారు. ఇక వారిలో ధనుష్ ముందున్నాడు. ఇప్పటివరకూ తన సినిమాలను తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేస్తూ వచ్చారు. ఇక ఇప్పుడు డైరెక్ట్ గా తెలుగులోనే సినిమా చేస్తూ తెలుగు ప్రేక్షకులను అలరించడానికి వచ్చేస్తున్నాడు. వెంకీ అట్లూరీ దర్శకత్వంలో ధనుష్ హీరోగా వస్తున్న సినిమా సార్. ఈసినిమా ఇప్పుడు షూటింగ్ ను పూర్తిచేసుకునే పనిలో ఉంది. ధనుష్‌ తెలుగులో నటిస్తోన్న తొలి సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ఎప్పుడో మొదలుపెట్టారు కూడా. ఇప్పటికే పలు పోస్టర్లు, ఇంకా ఒక పాటను కూడా ఇప్పటికే రిలీజ్ చేశారు చిత్రయూనిట్. నిజానికి ఈసినిమాను డిసెంబర్ లో రిలీజ్ చేద్దామనుకున్నారు కానీ పనులు ఇంకా పెండింగ్ లో ఉండటంతో ఫిబ్రవరిలో రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రస్తుతం అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది ఈసినిమా. ఇక ఈసినిమా నుండి అప్ డేట్ వచ్చి చాలా రోజులే అవుతుంది. అయితే తాజాగా ఈసినిమా నుండి బ్యాక్ టు బ్యాక్ అప్ డేట్స్ వచ్చాయి. అవేంటంటే.. ఈసినిమా తమిళనాడు హక్కులను ప్రముఖ సంస్థ సెవెన్ స్క్రీన్ సంస్థ వారు సొంతం చేసుకున్నారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ తెలిపింది. అంతేకాదు ఈ సినిమా నుండి సెకండ్ సాంగ్ కు సంబంధించిన అప్ డేట్ కూడా ఇచ్చారు. నానోడి మన్నన్ అనే పాట రికార్డ్ వర్క లో ఉందని తెలిపారు. త్వరలో ఈపాటను రిలీజ్ చేయనున్నారు.

కాగా ఈసినిమాలో ధనుష్ కు జోడీగా.. సంయుక్తా మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా సాయికుమార్,తనికెళ్ల భ‌ర‌ణి
, నర్రాశ్రీను కీలక పాత్రల్లో నటించనున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ బ్యానర్ లపై ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈసినిమాకు జి.వి. ప్ర‌కాష్‌కుమార్ సంగీతం అందిస్తుండగా.. సినిమాటోగ్రాఫర్ గా దినేష్ కృష్ణన్ పనిచేయనున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen + eight =