కార్తికేయ 2 బ్లాక్ బస్టర్ తో మంచి ఫామ్ లోకి వచ్చాడు నిఖిల్. ఇక ప్రస్తుతం పెండింగ్ లో ఉన్న 18 పేజెస్ ను రిలీజ్ కు సిద్దం చేస్తున్నాడు. పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో నిఖిల్ హీరోగా ఈసినిమా వస్తుంది. ఇక ప్రమోషన్స్ లో భాగంగా ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడాప్రకటించారు. ఈ నెల 19వ తేదీన బన్నీ ముఖ్య అతిథిగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. హైదరాబాదులోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ అందుకు వేదికగా మారనుంది. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ అయిన టీజర్, పాటలు అన్నీ ఈసినిమాపై అంచనాలను పెంచాయి. రెండు రోజులు క్రితమే ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు ట్రైలర్ కు కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇప్పటికే 5 మిలియన్లకు పైగా వ్యూస్ ను సొంతం చేసుకుంది. ఇది దాదాపు 130కే లైక్‌లను కూడా సంపాదించింది. ప్రస్తుతం ఈ ట్రైలర్ యూ ట్యూబ్ లో ట్రెండింగ్‌లో ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Join the Roller coaster ride of Love, Fun, Madness & Entertainment ~ #18PagesTrailer is out now 🤩
In theaters #18PagesOnDec23 🦋#18Pages @aryasukku @actor_Nikhil @anupamahere @idineshtej @dirsuryapratap #BunnyVas @GopiSundarOffl @adityamusic pic.twitter.com/d2latncrT9
— Geetha Arts (@GeethaArts) December 17, 2022
కాగా ఈసినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక సుకుమార్ ఈ చిత్రానికి కథ- స్క్రీన్ ప్లే అందించడంతో పాటు నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్నారు. సుకుమార్, గీతా ఆర్ట్స్ 2 సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తుండగా.. గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నాడు. డిసెంబర్ 23వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: