టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయికుమార్ హిట్, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నాడు. ఇటీవలే తీస్మార్ ఖాన్ సినిమాతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీగా ఉన్నాడు. శశికాంత్ దర్శకత్వంలో ఆది హీరోగా వస్తున్న సినిమా టాప్ గేర్. ఈసినిమా ప్రస్తుతం రిలీజ్ కు సిద్దమవుతుంది. ఇక ఈనేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్స్ కూడా ఎప్పుడో మొదలుపెట్టారు చిత్రయూనిట్. ఇప్పటికే ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేయగా.. టీజర్ కు మంచి రెస్పాన్సే వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. మాస్ మాహారాజా రవితేజ ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. ఇక ట్రైలర్ అయితే ఆకట్టుకుంటుంది. ఓ ట్యాక్సీ డ్రైవర్‌గా పనిచేసే హీరోకు అనుకోకుండా ఎదురైన ప్రమాదం నుంచి అతడు ఎలా బయటపడ్డాడు అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమాను థ్రిల్లింగ్ అంశాలతో తెరకెక్కించినట్లుగా ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఆది సాయి కుమార్ యాక్షన్ సీన్స్, సినిమాటోగ్రఫి, హర్ష వర్థన్ సంగీతం ఆకట్టుకుంటున్నాయి. సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఉన్న ఈ ట్రైలర్ అయితే ఆద్యంతం ఆకట్టుకొని సినిమాపై క్యూరియాసిటీ పెంచింది. మరి ఈసినిమాకు ఆదికి ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.
Here’s the trailer of #TopGear !
Best wishes to the entire team😊👍🏻https://t.co/ZA2jbRv9PT@iamaadisaikumar @IRiyaSuman #Shashikanth #KVSridharReddy @rameemusic #GiridharMamdipally #SaiSreeram @adityamusic #SriDhanaLakshmiProductions— Ravi Teja (@RaviTeja_offl) December 18, 2022
కాగా ఈసినిమాలో రియా సుమన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. ఇంకా ఈ చిత్రంలో బ్రహ్మాజీ, సత్యం రాజేష్, మైమ్ గోపి, నర్రా, శత్రు, బెనర్జీ, గిరిధర్, రేడియో మిర్చి హేమంత్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కె.వి శ్రీధర్ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు గిరిధర్ మామిడిపల్లి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. టాప్ గేర్ టీజర్ రిలీజ్ కు టైమ్ ఫిక్స్హర్ష వర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: