ఇటీవలే కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా వైడ్ గా హిట్ ను కొట్టాడు నిఖిల్. ఇక ఇప్పుడు మరో సినిమాను రిలీజ్ కు సిద్దం చేస్తున్నాడు. నిఖిల్ నుండి వస్తున్న కొత్త సినిమా 18 పేజెస్ ఈసినిమాలో నిఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమా ఇది. ఇప్పటికే వీరి కాంబనేషన్ లో వచ్చిన కార్తికేయ 2 బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. దీంతో ఈసినిమాపై కూడా భారీ ఎక్స్ పెక్టేషన్స్ పెరిగిపోయాయి. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. ఇప్పటికే ఈసినిమానుండి టీజర్ అలానే ఒక్కొక్కటిగా పాటలు రిలీజ్ చేసుకుంటూ వస్తున్నారు. ఇక ట్రైలర్ ను కూడా రిలీజ్ చేయడానికి సిద్దమయ్యారు. ట్రైలర్ రిలీజ్ డేట్ ను కూడా ఇప్పటికే ప్రకటించారు కూడా. డిసెంబర్ 17వ తేదీన ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. ఇక తాజాగా ఈసినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది. ఈసినిమాకు ఎలాంటి కట్స్ లేకుండా యూఏ సర్టిఫికెట్ ఇచ్చారు సెన్సార్ బృందం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
#18pages Passes the Censor with Flying Colours 🤩
CENSORED 𝗨/𝗔 with Zero Cuts.
A Different, Never Before Script with @aryasukku‘s Writing Mark.
Perfect Christmas Watch for Youth and Families.❤️@actor_Nikhil @anupamahere @idineshtej @dirsuryapratap #BunnyVas @GopiSundarOffl pic.twitter.com/rRS1tIQWLu
— Nikhil Siddhartha (@actor_Nikhil) December 16, 2022
కాగా రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాకు సూర్యప్రతాప్ పల్నాటి దర్శకత్వం వహించనున్నాడు. సుకుమార్, గీతా ఆర్ట్స్ 2 సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తుండగా.. గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నాడు. సుకుమార్ ఈ చిత్రానికి కథ- స్క్రీన్ ప్లే అందించడంతో పాటు నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్నారు. డిసెంబర్ 23వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: