గత ఏడాది అనుకోని విధంగా ఎంతో మంది సినీ సెలబ్రిటీలు పెళ్లిళ్లు చేసుకొని వివాహాబంధం లోకి అడుగుపెట్టారు. ఎంతో కాలంగా ఉన్న మోస్ట్ బ్యాచ్ లర్స్ చాలా మంది గత ఏడాది పెళ్లిళ్లు చేసుకున్నారు. కొంతమంది వివాహాలు అయితే షాకిచ్చాయి కూడా. ఇక ఏడాది కూడా చాలా మంది సినీ సెలబ్రిటీలు పెళ్లిళ్లు చేసుకొని కొత్త బంధంలోకి అడుగుపెట్టారు. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది నయనతారు పెళ్లి గురించి. సినీ రంగంలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న నయనతార పెళ్లి గురించి ఇప్పటికే ఎన్నో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. నయనతార, విఘ్నేష్ శివన్ లవ్ లో ఉన్నా ఎప్పుడూ బహిరంగంగా చెప్పింది లేదు. అయితే వారిద్దరూ మాత్రం ట్రిప్ లకు చెట్టాపట్టాలేసుకొని తిరుగుతూనే ఉండేవారు. ఇక ఎన్నోసార్లు పెళ్లి అయిపోయింది అన్న వార్తలు కూడా వచ్చాయి. ఎట్టకేలకు ఫైనల్ గా ఈఏడాది ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదే ఏడాది ఎప్పటినుండో ప్రేమలో ఉన్న బాలీవుడ్ జంట రణ్ బీర్ కపూర్ అలియా కూడా పెళ్లి చేసుకున్నారు. అలియాకు రణ్ బీర్ అంటే మొదటినుండీ క్రష్ అన్న సంగతి తెలిసిందే. ఇక బ్రహ్మాస్త్ర సినిమా మొదలుపెట్టినప్పుడే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు.. దాదాపు నాలుగేళ్ల తరువాత వీరిద్దరూ ఈఏడాది వివాహం చేసుకున్నారు. ఇప్పటికే అలియా తల్లిగా కొత్త జర్నీ స్టార్ట్ చేసేసింది కూడా.
ఇంకా రీసెంట్ గా టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య వివాహం కూడా జరిగింది. నిజానికి నాగశౌర్య వివాహం గురించి తను అధికారికంగా ప్రకటించేవరకూ కూడా ఎలాంటి న్యూస్ రాలేదు. బెంగుళూరు కు చెందిన అనూష అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు నాగశౌర్య.
క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ కూతురు నీలిమ గుణశేఖర్ వివాహం కూడా రీసెంట్ గానే జరిగింది. ప్రముఖ విద్యావేత్త, వ్యాపారవేత్త, ఎంటర్ ప్రెన్యూరర్, శ్రీ శక్తి గ్రూప్ అధినేతలు అయిన డా.రామకృష్ణ పింజల, సత్య పింజల కుమారుడు రవి ప్రఖ్యాతో ఆమె జరిగింది. ప్రస్తుతం తను శాకుంతలం సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తుంది.
ఇక ఇదే ఏడాది నటి పూర్ణ కూడా వివాహం చేసుకుంది. షానిద్ అసిఫ్ అలీ అనే బిజినెస్ మ్యాన్ ను పూర్ణ పెళ్లి కోబోతుంది. ప్రస్తుతం తను పలు సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తూనే మరోపక్క బుల్లితెరపై పలు షోలకు బడ్జిగా కూడా వ్యవహరిస్తుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: