చాలా గ్యాప్ తరువాత వచ్చిన టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ కార్తికేయ2 తో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. కార్తికేయ సినిమాకు ఈసినిమా సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే కదా. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈసినిమా కేవలం సౌత్ లోనే కాదు నార్త్ లో కూాడా తన సత్తా చాటుకుంది. దీంతో నిఖిల్ కూడ దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఇప్పుడు ప్రస్తుతం అయితే తన కొత్త సినిమాలను రిలీజ్ చేసే పనిలో ఉన్నాడు. అందులో ముందు పెండింగ్ లో ఉన్న సినిమా 18 పేజెస్. ఈసినిమా ఇప్పటికే రిలీజ్ అవ్వాలి కానీ మధ్యలో కరోనా వల్ల లేట్ అవ్వడంతో ఇంతవరకూ రిలీజ్ కాలేకపోయింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. ఇక మరోవైపు ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు. ఈనేపథ్యంలో తాజాగా ఈసినిమా ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేశారు. సంబంధించిన అప్ డేట్ ను ఇచ్చారు. నన్నయ రాసిన అనే లిరికల్ పాటను రిలీజ్ చేశారు నేడు. మెలోడియస్ గా ఉన్న ఈపాట ఆకట్టుకుంటుంది. శ్రీమణి లిరిక్స్ రాయగా.. పృథ్వి చంద్ర, సితార కృష్ణకుమార్ లు ఆలపించారు.
Here’s the first single ~ #NannayaRaasina from #18Pages is out now! ♥️
A @GopiSundarOffl Musical 🎹@aryasukku @actor_Nikhil @anupamahere @dirsuryapratap #BunnyVas @lightsmith83 @NavinNooli @raparthysaran @SukumarWritings @GA2Official @adityamusic pic.twitter.com/aCvagEsHwA
— GA2 Pictures (@GA2Official) November 22, 2022
కాగా పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో నిఖిల్ హీరోగా వస్తున్న ఈసినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక సుకుమార్ ఈ చిత్రానికి కథ- స్క్రీన్ ప్లే అందించడంతో పాటు నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్నారు. సుకుమార్, గీతా ఆర్ట్స్ 2 సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తుండగా.. గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: