టాలీవుడ్ యంగ్ హీరోలు ఒకపక్క సినీ కెరీర్ ను కొనసాగిస్తూనే మరోపక్క వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నారు. ఈమధ్య చాలామంది యంగ్ హీరోలు వివాహ చేసుకున్నారు. ఇక ఇప్పుడు మరో యంగ్ హీరో పెళ్లి పీటలెక్కాడు. ఆ హీరో ఎవరో ఇప్పటికే అర్థమై ఉంటుంది కదా. టాలీవుడ్ లో తన సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నాగశౌర్య. బెంగళూరుకు చెందిన అనూష శెట్టిని నాగశౌర్య వివాహం చేసుకున్నారు. బెంగుళూరులోని జెడబ్ల్యూ మారియట్ అనే ఒక ఫైవ్ స్టార్ హోటల్లో వివాహం చేసుకున్నాడు. ఇరు కుటుంబ సభ్యులు, బంధు మిత్రుల సమక్షంలో ఈ పెళ్లి వేడుక జరిగింది. ఇక ఈసందర్భంగా నాగశౌర్య తన సోషల్ మీడియా ద్వారా ఒక ఫోటో ను షేర్ చేశారు. అనూష శెట్టితో ఉన్న ఫొటోను పోస్టే చేసి నా లైఫ్ టైమ్ రెస్పాన్సిబిలిటీని పరిచయం చేస్తున్నాను అని క్యాప్షన్ ఇచ్చాడు. అనూష శెట్టి బెంగుళూరుకు చెందిన అమ్మాయి. ఇంటీరియర్ డిజైనర్ గా చేస్తుంది అనూష శెట్టి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
Introducing my Lifetime Responsibility ❤️♾🧿#Letsgoshaan pic.twitter.com/77bIT8Kivd
— Naga Shaurya (@IamNagashaurya) November 20, 2022
తెలుగులో ఊహలు గుసగుసలాడే అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న నాగశౌర్య. ఆ తర్వాత తెలుగులో అనేక సినిమాలతో మంచి గుర్తింపుతెచ్చుకున్నాడు. రీసెంట్ గానే కృష్ణ వ్రిందా విహారి సినిమాతో డీసెంట్ హిట్ ను అందుకున్నాడు. ప్రస్తుతం నాగశౌర్య పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. రీసెంట్ గానే తన 24వ సినిమాను ప్రకటించాడు. ఎస్ ఎస్ అరుణాచలం దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా ఈ సినిమా తెరకెక్కుతుంది. వైష్ణవి ఫిలింస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం 1 గా శ్రీనివాసరావు చింతలపూడి, విజయ్ కుమార్ చింతలపూడి, డాక్టర్ అశోక్ కుమార్ చింతలపూడి ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మించనున్నారు. ఇక ఈ సినిమాలో నటించే నటుల వివరాలను త్వరలో తెలియచేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: