నిన్న ఉదయం గుండెపోటుకు గురైన కృష్ణను కాంటినెంటల్ హాస్పిటల్ కు తరలించారు. ఇక వైద్యులు కూడా పరిస్థితి కాస్త విషమంగానే ఉందని చెప్పారు. ఈలోపే నేడు తెల్లవారు జామున కృష్ణ తుదిశ్వాస విడిచారు. దీంతో తెలుగు చిత్రపరిశ్రమ, కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ప్రస్తుతం ఆయన భౌతికకాయాన్ని హైదరాబాద్‌లోని నానక్ రామ్ గూడలోని ఆయన నివాసంలో ఉంచారు. పలువురు ప్రముఖులు ఆయన భౌతికకాయాన్ని చూడటానికి వచ్చి మహేష్ కుటుంబానికి నివాళులర్పించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా కృష్ణ మరణానంతరం నేడు పలు అప్ డేట్లను ఆపేశారు. మరోవైపు కృష్ణకు సంతాప సూచకంగా రేపు సినిమా షూటింగ్‌లను నిలిపివేయాలని నిర్మాతల మండలి నిర్ణయించింది. ఈ మేరకు కౌన్సిల్ అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది. ఇక ఆయన పార్థివ దేహాన్ని హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు. అనంతరం రేపు హైదరాబాద్‌లోని మహాప్రస్థానంలో ప్రభుత్వ లాంఛనాలతో సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు జరగనున్నాయి.
కాగా తెలుగు సినీ చరిత్రలో సూపర్ స్టార్ కృష్ణ చేసిన సాహసాలు అన్నీ ఇన్నీ కావు. ఆ రోజుల్లోనే టెక్నాలజీని పరిచయం చేసిన ఏకైక హీరో కృష్ణ. మొదటగా పలు నాటకల్లో నటించిన ఆయన ఆ తరువాత పలు సినిమాల్లో చిన్న పాత్రల్లో నటించారు. ఇక తేనెమనసులు సినిమాతో నటుడిగా అందరి ప్రశంసలందుకున్నారు కృష్ణ. తొలి చిత్రం సాధించిన విజయంతో కృష్ణ వెను దిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది ఇక తన సినీ ప్రయాణంలో 350 పైగా చిత్రాల్లో ఎన్నో సాంఘిక, జానపద, పౌరాణిక,జేమ్స్‌బాండ్, కౌబాయ్ వంటి డిఫరెంట్ చిత్రాల్లో మెప్పించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: