సూపర్ స్టార్ కృష్ణ ప్రస్తుతం కాస్త అస్వస్థతకు గురయ్యారు. శ్వాస సంబంధిత సమస్య తలెత్తడంతో ఆయన్ను కుటుంబ సభ్యులు గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రికి తరలించారు. దీంతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఈనేపథ్యంలో సీనియర్ హీరో నరేష్ స్పందిస్తూ.. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని జనరల్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లారని తెలిపారు. అభిమానులెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. దీంతో అభిమానులు కాస్త ఊరట చెందారు. కాగా సూపర్ స్టార్ కృష్ణ కొంత కాలంగా మానసికంగా బాధలో ఉన్న సంగతి తెలిసిందే. ముందు విజయ నిర్మల మరణం.. ఆ తరువాత తన పెద్ద కుమారుడు రమేష్ బాబు హఠాన్మరణం చెందడం.. రీసెంట్ తన మొదటి భార్య పద్మావతి మరణించడంతో మానసికంగా కృంగి పోయారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా సూపర్ స్టార్ కృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. సాహసాలకు మారు పేరు కృష్ణ. ప్రయోగాత్మక సినిమాలు తీయాలంటే ఆయన తరువాతే. ఎన్టీఆర్, ఏఎన్నాఆర్ రాజ్యమేలుతున్న వేళ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన కృష్ణ తనదైన మార్గం నిర్దేశించుకున్నారు. ఒకరు జానపదం మరొకరు పౌరాణికాలకు పెట్టింది పేరుగా ముందుకు సాగుతున్న వేళ.. సాంఘిక చిత్రాలకు కేరాఫ్ గా మారారు కృష్ణ. ఇక తెలుగు సినీ చరిత్రలో సూపర్ స్టార్ కృష్ణ చేసిన ప్రయోగాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమాల గురించి కాస్త పరిజ్ఞానం ఉన్న ఎవరికైనా తెలుస్తుంది. తెలుగు వెండి తెరపై కృష్ణ చేసిన ప్రయోగాలు మరే హీరో చేయలేదంటే అతిశయోక్తి కాదు. తెలుగులో మొదటి 70 ఎమ్‌ఎమ్ సినిమా… `మోసగాళ్లకు మోసగాడు` చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు కౌబాయ్‌ని పరిచయం చేశారు. ఇంకా జేమ్స్ బాండ్ చిత్రాలతో పాటు ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలు చేసి రికార్డు సాధించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: