ఆది సాయికుమార్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఆయన లిస్ట్ లో దాదాపు ఆరడజను సినిమాలు ఉన్నాయి. అందులో ‘CSI సనాతన్’ ఒకటి. సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈసినిమాకు శివశంకర్ దేవ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టారు చిత్రయూనిట్. దీనిలో భాగంగా ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు. బాబీ డైరెక్షన్ లో టీజర్ ను రిలీజ్ చేశారు. టీజర్ బాగుందన్న ఆయన చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక టీజర్ విషయానికి వస్తే టీజర్ చాలా బాగా ఆకట్టుకుంటుంది. విక్రమ్ అనే ప్రముఖ పారిశ్రామిక వేత్త హత్య కేసును ఛేదించేందుకు రంగంలోకి దిగిన క్రైమ్ సీన్ ఆఫీసర్ గా ఆది కనిపిస్తున్నాడు. ఒక హత్య జరిగిందంటే హంతకుడు తప్పకుండా ఉంటాడు. ఐదుగురు అనుమానితులు ఐదు డిఫరెంట్ వెర్షన్స్ వినిపిస్తున్నారు. వాటిలో ఏది నిజం అనేది ఆయన విచారణలో తెలుసుకునే క్రమం ఆసక్తిగా ఉండనుంది. నౌ ద రియల్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్స్ అనే డైలాగ్ తో టీజర్ ఇంట్రెస్టింగ్ గా ముగుస్తుంది. మొత్తానికి టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసింది.
Thank you @DirBobby garu for launching our #CSISanatan Teaser.
Eagerly looking forward to the MEGA treat #WaltairVeerayya 🙌
▶️https://t.co/loDsljdnUs@iamaadisaikumar @NarangMisha @AjaySrinivasOFC @dev_sivashankar @Aneeshsolomon https://t.co/pEBibcMYaj
— Chaganti Productions (@chagantiproducs) November 10, 2022
కాగా ఈసినిమాలో ఆదికి జోడీగా మిషా నారంగ్ హీరోయిన్‌గా నటిస్తుంది. అలీ రెజా, నందిని రాయ్, తాకర్ పొన్నప్ప, మధు సూదన్, వసంతి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సినిమాటోగ్రఫీగా జిశేఖర్, మ్యూజిక్ డైరెక్టర్ గా అనీష్ సోలోమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని చాగంటి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అజయ్ శ్రీనివాస్ నిర్మిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: