అవ ఎంటర్‌టైన్‌మెంట్స్ , 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్ పై ఈషాన్ సూర్య దర్శకత్వంలో విష్ణు మంచు హీరోగా కామెడీ ఎంటర్ టైనర్ జిన్నా మూవీ అక్టోబర్ 21 వ తేదీ రిలీజ్ కానుంది. పాయల్ రాజ్ పుత్ , సన్నీ లియోన్ కథానాయికలు. వెన్నెల కిషోర్, రఘు బాబు, చమ్మక్ చంద్ర, కమెడియన్ సద్దాం ముఖ్య పాత్రలలో నటించారు. మూల కథను ప్రముఖ దర్శకుడు జి. నాగేశ్వరరెడ్డి అందించగా, ఈ మూవీ కి కథ , స్క్రీన్ ప్లే తో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా స్టార్ రైటర్ కోన వెంకట్ వ్యవహరిస్తున్నారు.అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. చిత్రయూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , సాంగ్స్ , టీజర్ , ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆదివారం జిన్నా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. కలెక్షన్ కింగ్, నట ప్రపూర్ణ డాక్టర్ మంచు మోహన్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విష్ణు మంచు మాట్లాడుతూ ..జిన్నా సినిమా విషయంలో నేను ముందుగా కోన వెంకట్‌గారికి , ఛోటాగారికి థాంక్స్ చెప్పాలనీ , ఆయనతో ఎప్పటి నుంచి పని చేయాలని అనుకుంటుంటే ఈ సినిమాకు కుదిరిందనీ , జిన్నా తన మనసుకు దగ్గర అయిన సినిమా అనీ , అనూప్‌కి స్పెషల్ థాంక్స్ అనీ , తన కెరీర్‌లోనే బెస్ట్ మ్యూజిక్‌ని ఈ సినిమాకు ఇచ్చారనీ , 21న రిలీజ్ అవుతున్న ఈ సినిమాను అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాననీ చెప్పారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: