రీసెంట్ గానే ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’తో మంచి విజయాన్ని అందుకున్నాడు విశ్వక్ సేన్. ఇక ఇప్పుడు మరో డిఫరెంట్ పాత్రలో వచ్చేస్తున్నాడు. విశ్వక్ సేన్ హీరోగా ప్రస్తుతం ఓరి దేవుడా అనే సినిమా రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఈసినిమా తమిళంలో సూపర్ హిట్ అయిన ” ఓ మై కడవులే” చిత్రానికి రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఇక ఒరిజినల్ వర్షన్ ను తెరకెక్కించిన అశ్వత్ మారిముత్తు ఈసినిమాకు కూడా దర్శకత్వం వహించాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా దీపావళి పండుగ సందర్బంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అన్ని కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకోని రిలీజ్ కు సిద్దంగా ఉంది. మరోవైపు రిలీజ్ కూడా దగ్గరపడుతుండటంతో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే టీజర్, ట్రైలర్ లను రిలీజ్ చేయగా ఎంత రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయో చూశాం. ట్రైలర్ టాప్ 1లో ట్రైండ్ అయిందంటేనే చెప్పొచ్చు ఈసినిమా ట్రైలర్ ఎంత ఆకట్టుకుందో.
ఇదిలా ఉండగా తాజాగా ఈసినిమాకు సంబంధించి అప్ డేట్ ఇచ్చారు మ్యూజిక్ డైరెక్టర్ లియోన్ జేమ్స్. నేడు తన సోషల్ మీడియా వేదికగా.. ఈసినిమా ఫైనల్ మిక్స్ అయిపోయిందని.. అక్టోబర్ 21వ తేదీన రాబోతున్న ఫుల్ మీల్స్ లాంటి ఎంటర్ టైన్ మెంట్ కోసం వెయిట్ చేయండి అంటూ తన పోస్ట్ లో పేర్కొన్నారు.
View this post on Instagram
కాాగా ఈ మూవీ లో విశ్వక్ సేన్ సరసన మిథిలా పాల్కర్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా.. విక్టరీ వెంకటేష్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. పివిపి సినిమా, శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ల మీద పెరల్ వి పొట్లూరి, పరమ్ వి పొట్లూరి, దిల్ రాజు ఈసినిమాను నిర్మిస్తున్నారు. లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నారు. తరుణ్ భాస్కర్ డైలాగ్స్ అందిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: