ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్ పై పీ.ఎస్. మిత్రన్ దర్శకత్వం లో కార్తీ హీరోగా తెరకెక్కిన స్పై యాక్షన్ థ్రిల్లర్ సర్దార్ తమిళ మూవీ , తెలుగు డబ్బింగ్ వెర్షన్ సర్దార్ మూవీ దీపావళి కానుకగా అక్టోబర్ 21 వ తేదీ రిలీజ్ కానుంది . ఈ మూవీ తెలుగు వెర్షన్ ను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై కింగ్ నాగార్జున రిలీజ్ చేస్తున్నారు. హీరో కార్తీ ద్విపాత్రాభినయం చేసిన ఈ మూవీ లో రాశీ ఖన్నా , రజిష విజయన్ కథానాయికలు.చుంకీ పాండే విలన్ గా నటించిన ఈ మూవీలోని ఇతర పాత్రల్లో లైలా, మురళీ శర్మ, మునిష్ కాంత్ తదితరులు నటించారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
దాదాపుగా 15 ఏళ్ల తరువాత సర్దార్ మూవీతో సీనియర్ హీరోయిన్ లైలా రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ మూవీ లో లైలా పాత్ర గురించి హీరో కార్తి మాట్లాడుతూ …తన సినిమా లో లైలా రీ ఎంట్రీ ఇవ్వడం చాలా సంతోషాన్ని కలిగించే విషయం అనీ , ఆమె పాత్ర చాలా డిఫరెంట్ గా ఉంటుందనీ ,సర్దార్ మూవీలో లైలా పాత్రా చాలా కీలకమనీ , ఆమె పాత్ర వల్లనే ఈసినిమా కథ మలుపు తిరుగుతుందనీ , ఈ సినిమాలో తనతో పాటు లైలాను చూసి ఆడియర్స్ థ్రిల్ ఫీల్ అవుతారనీ చెప్పారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: