రాజమౌళి- మహేష్ బాబు కాంబినేషన్.. ఈ కాంబినేషన్ కోసం ఎంత మంది ఎప్పటినుండి ఆశగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేవలం ఫ్యాన్స్ మాత్రమే కాదు సినీ లవర్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈసినిమా షూటింగ్ ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందో తెలియదు కానీ ఇప్పటికే ఈసినిమాపై పలు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్ సినిమా వస్తుందని ఎప్పుడైతే తెలిసిందే.. అప్పటినుండీ ఏదో ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ తెరపైకి వస్తూనే ఉంది. అంతేకాదు ఈసినిమా గురించి ప్రముఖ రచయిత, రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కూడా ఎన్నోసార్లు పలు ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిపారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా మరోసారి ఈసినిమా గురించి క్రేజీ అప్ డేట్ ఇచ్చారు విజయేంద్ర ప్రసాద్. ఈసినిమా యదార్థ సంఘటనల ఆధారంగా ఈసినిమా తెరకెక్కనుందని.. ప్రస్తుతం అయితే రాజమౌళి ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడని.. వచ్చే ఏడాది నుండి ఈసినిమా షూటింగ్ ప్రారంభం కానుందని తెలిపారు. భారీ స్థాయిలో ఈసినిమాను తెరకెక్కిస్తున్నట్టు కూడా తెలిపారు. కాగా ఈసినిమాను శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కే ఎల్ నారాయణ ఈ సినిమాను నిర్మించబోతున్నారు.
కాగా ఈఏడాది సర్కారు వారి పాట సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు మహేష్. ఇక ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నారు. ఈసినిమాలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే నటిస్తుంది. దీనితో పాటు మధి కెమెరామెన్‌గా, నవీన్ నూలి ఎడిటర్‌గా, థమన్ సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్‌పై ఎస్.రాధాకృష్ణ ఈసినిమాను నిర్మిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: