కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

వరల్డ్ వైడ్ గా ఆదిపురుష్ హవా

Adipurush Movie Hawa In Worldwide, Adipurush Hawa In Worldwide, Worldwide Hawa, Adipurush Movie Hawa, Prabhas And Kriti Sanon's Adipurush Movie, Prabhas, Om Raut, Saif Ali Khan, Kriti Sanon, Prabhas Latest Movie, Prabhas's Upcoming Movie, Adipurush,

వరల్డ్ వైడ్ గా ఆదిపురుష్ హవా

Adipurush Movie Hawa In Worldwide

Adipurush Movie Hawa In Worldwide, Adipurush Hawa In Worldwide, Worldwide Hawa, Adipurush Movie Hawa, Prabhas And Kriti Sanon's Adipurush Movie, Prabhas, Om Raut, Saif Ali Khan, Kriti Sanon, Prabhas Latest Movie, Prabhas's Upcoming Movie, Adipurush,

టి – సిరీస్ ,రెట్రో ఫైల్స్ బ్యానర్స్ పై సూపర్ హిట్ తానాజీ మూవీ ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా భారత చలన చిత్ర చరిత్ర లో అత్యధిక బడ్జెట్ తో, హాలీవుడ్ స్థాయి టెక్నాలజీ తో 3డి ఫార్మాట్ లో రామాయణం ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో మైథలాజికల్ మూవీ గా తెరకెక్కుతున్న ఆదిపురుష్ మూవీ 2023 సంవత్సరం జనవరి 12వ తేదీ తెలుగు , హిందీ భాషలతో పాటు కన్నడ , తమిళ , మలయాళ భాష డబ్బింగ్ వెర్షన్స్ రిలీజ్ కానున్నాయి. హీరో ప్రభాస్ రాముడిగా నటిస్తున్న ఈ మూవీ లో సీతగా కృతి సనన్ , రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ , లక్ష్మణుడిగా సన్నీసింగ్ నటిస్తున్నారు. హీరో ప్రభాస్ నటించిన ఫస్ట్ మైథలాజికల్ మూవీ ఆదిపురుష్ మూవీ ని పాన్ వరల్డ్ మూవీ గా రిలీజ్ కానుందని సమాచారం.

అక్టోబర్ 2వ తేదీ అయోధ్య‌లో ఆదిపురుష్ మూవీ టీజ‌ర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. హీరో ప్రభాస్ రాముడిగా ఎంట్రీ , పవర్ ఫుల్ డైలాగ్స్ ,యాక్షన్ సీన్స్ తో విజువల్ వండర్ గా రూపొందిన టీజర్ ప్రేక్షక, అభిమానులను విశేషంగా ఆకట్టుకుని 24 గంటలలో 100 మిలియన్ వ్యూస్ కు పైగా రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. టీజర్ ను కొంతమంది ప్రేక్షకులు విమర్శించిన విషయం తెలిసిందే.అభిమానులకై చిత్ర యూనిట్ ఆదిపురుష్ 3D టీజర్ ను థియేటర్స్ లో రిలీజ్ చేయగా అద్భుత స్పందన లభించింది. గత నెల రోజుల నుంచి వరల్డ్ వైడ్ గా అత్యధికంగా సెర్చ్ చేయబడినచిత్రంగా ఆదిపురుష్ నెంబర్ 1 స్థానంలో నిలిచినట్టు సమాచారం.

వీడియోస్

సంబంధిత వార్తలు

అన్నీ
వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్