ఎంతో మంది వారసులు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తుంటారు. కానీ వారిలో కొంతమంది మాత్రం ఆ అవకాశాన్ని వినియోగించుకొని తమను ప్రూవ్ చేసుకుంటారు. అలా ఎంతోమంది ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కూడా దూసుకుపోతున్నారు. ఇక ఇప్పుడు మరో హీరో కూడా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆహీరోనే బెల్లంకొండ గణేష్. లక్ష్మణ్ కె కృష్ణ లో దర్శకత్వం గణేష్ హీరోగా వచ్చిన సినిమా స్వాతిముత్యం. ఈసినిమా దసరా పండుగ సందర్భంగా ఈనెల 5వ తేదీన రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా అన్నిచోట్ల పాజిటివ్ రివ్యూస్ ను సొంతం చేసుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
గణేష్ కు కలిసొచ్చింది మాత్రం తను కమర్షియల్ ఎలిమెంట్స్ కు దూరంగా ఉండటమే కారణం. పెద్ద హడావుడి లేకుండా ఒక ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్ తో వచ్చి మొదటి సినిమాతోనే మంచి నటుడిగా ప్రశంసలు దక్కించుకున్నాడు. ఈ సినిమాలో లవ్ .. ఎమోషన్ .. కామెడీని కలిసి నడిపించిన తీరు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక ఈసినిమా హిట్ అవ్వడంతో చిత్రయూనిట్ సక్సెస్ సెలబ్రేషన్స్ ను చేసుకుంటుంది. ఈ సందర్భంగా గణేష్ మాట్లాడుతూ.. ముందుగా తెలుగు ప్రేక్షకులకు థ్యాంక్స్ చెబుతున్నాను. ఎందుకంటే హీరోగా నన్ను అంగీకరించారు .. ఈ సినిమాకి సక్సెస్ ఇచ్చారు. ఈ సినిమాలో తెరపై గణేష్ కనిపించలేదు .. బాలా అనే ఆ పాత్ర మాత్రమే కనిపించిందని అంటున్నారు. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. హీరోగా తొలి సినిమాతో ఒక 10 మార్కులు వేయించుకున్నానని అనుకుంటున్నాను. ఇంతమంచి కథను నా దగ్గరికి తీసుకుని వచ్చినందుకు లక్ష్మణ్ కృష్ణకు థ్యాంక్స్ చెబుతున్నాను. ఈ కథను మా కంటే ఎక్కువగా నమ్మి, నిర్మాతగా ముందుకు వచ్చిన సితార వంశీ గారికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను అని తెలిపాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: