మొత్తానికి ఇప్పుడే అన్ని ఇండస్ట్రీలకు బ్లాక్ బస్టర్ హిట్లు దక్కుతున్నాయి. గత రెండేళ్లలో కరోనా వల్ల థియేటర్లు లేక సినిమాలు లేక ఇండస్ట్రీ ఎంతో నష్టపోయింది. కాస్త ఈ ఏడాది నుండే మళ్లీ పుంజుకుంటుంది. ఇప్పటికే తెలుగులో అఖండ, పుష్ప నుండి ఆర్ఆర్ఆర్ వరకూ రీసెంట్ గా వచ్చిన కార్తికేయ2 ఇలా చాలా సినిమాలు తెలుగు ఇండస్ట్రీని మరింత నిలబెట్టాయి. మరోవైపు ఎప్పటినుండో బాలీవుడ్ కు కూడా సరైన హిట్ లేక సతమతమవుతున్న తరుణంలో బ్రహ్మస్త్ర సినిమా వచ్చి ఊరటనిచ్చింది. అలానే తమిళ్ ఇండస్ట్రీకి కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమా బూస్ట్ నిచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
క్రియేటివ్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన సినిమా పొన్నియన్ సెల్వన్. కల్కి కృష్ణమూర్తి రాసిన పొన్నియన్ సెల్వన్ నవల ఆధారంగా మణిరత్నం పొన్నియన్ సెల్వన్ సినిమాను తెరకెక్కించాడు. చోళుల కథ ఆధారంగా తెరకెక్కిన ఈసినిమా.. పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అవ్వగా ఈసినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. మణిరత్నం టేకింగ్ అలాగే విజువల్ వండర్ గా ఈసినిమా ఉందన్న ప్రశంసలు దక్కాయి. ఇక ఈసినిమా కలెక్షన్స్ పరంగా కూడా భారీ కలెక్షన్సే సొంతం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 300 కోట్ల క్లబ్ లో చేరిపోయింది.
ఇక ఈసినిమా ఇప్పుడు కొత్త రికార్డులు సైతం క్రియేట్ చేస్తుంది. ఇప్పటికే ఈసినిమా తమిళ వెర్షన్ లో ‘బాహుబలి’ పేరుతో ఉన్న రికార్డును ఈ సినిమా అధిగమించింది. దానితోపాటు ఇక ఇటీవల కాలంలో ‘విక్రమ్’ సినిమాతో కమల్ సెట్ చేసిన రికార్డును అధిగమించడానికి కూడా ఎన్నో రోజులు పట్టదని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ సినిమా ‘2.0’ పేరుతో ఉన్న రికార్డును తుడిచేసి నెంబర్ వన్ స్థానంలో నిలిచే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
కాగా ఈసినిమాలో విక్రమ్, కార్తీ, త్రిష, పార్తిబన్, ఐశ్వర్యా రాయ్ బచ్చన్, జయరామ్, జయం రవి తదితరులు కీలకపాత్రల్లో నటించారు. ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సంయుక్తంగా నిర్మించాయి. తమిళంతో పాటు హిందీ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో ఈసినిమా రిలీజ్ అయింది. ఈసినిమాకు ఏ.ఆర్ రెహమాన్ సంగీతం అందించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: