రెబల్ స్టార్ కృష్ణంరాజు కన్నుమూత

veteran actor krishnam raju passes away, Krishnam Raju Tollywood’s Legendary Veteran Actor Has Passed Away At The Age Of 83, Krishnam Raju Has Passed Away At The Age Of 83, Tollywood’s Legendary Veteran Actor, Hero Krishnam Raju, Tollywood’s Veteran Actor, Legendary Telugu Actor, former Union Minister Krishnam Raju, Tollywood’s Rebel Star, Uppalapati Krishnam Raju, Chilaka Gorinka, Krishnam Raju Movies, Krishnam Raju Latest Movies, Tollywood actor Krishnam Raju has passed away in Hyderabad at the age of 83, Telugu Filmnagar,Telugu Film News 2022,Tollywood Latest,Tollywood Movie Updates,Latest Telugu Movies News, Tollywood’s Legendary Veteran Actor Krishnam Raju,Krishnam Raju Last Movie, Rebel Star Krishnam Raju

ఈరెండేళ్లలో ఎంతో మంది సినీ ప్రముఖులను కోల్పోయింది తెలుగు సినీ పరిశ్రమ. ఎంతో మంది లెజెండరీ నటీనటులు, గాయకులు, రచయితలు ఇలా ఎంతోమందిని సినీ పరిశ్రమ కోల్పోయింది. ఇక తాజాగా మరో సీనియర్ లెజెండరీ హీరోను ఇండస్రీ కోల్పోయింది. ఆ నటుడు ఎవరో కాదు రెబల్ స్టార్ కృష్ణం రాజు. పాత తరం నాయకుల్లో ఇండస్ట్రీకి అండగా పెద్దగా ఉన్న హీరో కృష్ణంరాజు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కృష్ణంరాజు ఏఐజీ ఆస్పత్రిలో నేడు తెల్లవారుజామున మృతి చెందారు. కృష్ణం రాజు మృతితో టాలీవుడ్ మొత్తం విషాదంలో మునిగిపోయింది. ఇక కృష్ణంరాజు మృతిపట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియచేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా కృష్ణం రాజు 1940 జనవరి 20న మొగల్తూరులో ఉప్పలపాటి వీర వెంకట సత్యనారాయణ రాజు, లక్ష్మి దేవి దంపతులకు జన్మించారు. 1966లో చిలకా గోరింక అనే సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు. ఆ సినిమా అనుకున్న మేర సక్సెస్ ఇవ్వలేదు. ఆ తరువాత ‘నేనంటే నేనే’ సినిమా చేశారు. ఆ సినిమా సక్సెస్ అవ్వడంతో ఆ తరువాత వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ.. విభిన్నమైన పాత్రలు చేసి రెబల్ స్టార్ గా ఎదిగారు. దాదాపు 60 ఏళ్ళకి పైగా కృష్ణం రాజు సినీ కెరీర్ కొనసాగింది. హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వందలాది చిత్రాల్లో నటించారు. తన సినీ కెరియర్లో మొత్తం 183 సినిమాల్లో ఆయన నటించారు. చివరిగా రాధేశ్యామ్ అనే సినిమాలో ఒక జ్యోతిష్యుడు పాత్రలో కనిపించారు ఆయన. కృష్ణం రాజుకి మొత్తం ముగ్గురు కుమార్తెలు సంతానం. సాయి ప్రసీద, సాయి ప్రదీప్తి, సాయి ప్రకీర్తి కృష్ణం రాజు సంతానం.

ఇక సినిమాల్లోనే కాదు రాజకీయాల్లో కూడా కృష్ణంరాజు విజయ కేతనం ఎగరవేశారు. కృష్ణం రాజు సినిమాల్లో నటిస్తూనే రాజకీయరంగ ప్రవేశం చేశారు. 1991లో కాంగ్రెస్‌ పార్టీలో చేరి నర్సాపురం లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీచేయగా ఓడిపోయారు. ఆ తర్వాత 1998 ఎన్నికల ముందు భారతీయ జనతా పార్టీలో చేరారు. కాకినాడ లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసి విజయం సాధించి లోక్‌సభలో అడుగుపెట్టారు. కేంద్ర మంత్రిగా పనిచేసిన తొలి నటుడిగా కృష్ణంరాజు రికార్డులకెక్కారు.

ఇక కృష్ణంరాజు వారసత్వంతోనే ప్రభాస్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు ప్రభాస్ రేంజ్ ఎలా ఉందో చూశాం. పాన్ ఇండియా స్టార్ గా పేరు తెచ్చుకొని దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ ను తెచ్చుకొని సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం అయితే ప్రభాస్ చేసే సినిమాలు అన్నీ పాన్ ఇండియా సినిమాలే.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − thirteen =