హిట్ లేకపోతే ఎలా ఉంటుందో తెలుసు

Sharwanand emotional speech at oke Oka Jeevitham success meet, oke Oka Jeevitham success meet, Sharwanand emotional speech, Sharwanand speech, oke Oka Jeevitham, Oke Oka Jeevitham Telugu Movie Review,Oke Oka Jeevitham Movie Review,Oke Oka Jeevitham Review,Oke Oka Jeevitham Telugu Review,Oke Oka Jeevitham Movie Review In Telugu,Oke Oka Jeevitham,Oke Oka Jeevitham Movie,Oke Oka Jeevitham Telugu Movie,Oke Oka Jeevitham Review - Telugu,Oke Oka Jeevitham Movie Reviews,Oke Oka Jeevitham - Telugu Movie Reviews,Oke Oka Jeevitham Movie Public Talk,Oke Oka Jeevitham Movie Public Response,Oke Oka Jeevitham Movie Updates, Telugu Filmnagar,Telugu Film News 2022,Tollywood Latest,Tollywood Movie Updates,Latest Telugu Movies News

ఎంత స్టార్ హీరో అయినా సరే హిట్ తప్పని సరి. ఏదో ఒకటి రెండు సినిమాలు ఫ్లాప్ అయితే పెద్దగా పట్టింకోరు కానీ.. వరుసగా ఫ్లాప్స్ వస్తేనే అటు అభిమానులకు మాత్రమే కాదు హీరోలకు కూడా చాలా సమస్యగా ఉంటుంది. ఇక ఇప్పుడున్న పోటీ వాతావరణంలో హీరోలకు వరుసగా ఫ్లాప్స్ వస్తే ఎలాంటి కామెంట్స్ వినిపిస్తాయో కూడా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక యంగ్ హీరో శర్వానంద్ కూడా ఇదే విషయం చెబుతున్నాడు. ఫ్లాప్ వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసని అంటున్నాడు శర్వానంద్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

శర్వానంద్ కు మంచి హిట్ దక్కి చాలా కాలం అవుతుంది. అయితే రీసెంట్ గా వచ్చిన ఒకే ఒక జీవితం మాత్రం మంచి హిట్ ను ఇచ్చింది. శ్రీకార్తిక్ దర్శకత్వంలో టైమ్ ట్రావెలింగ్ నేపథ్యంలో మదర్ సెంటిమెంట్ జోడించిన ఈసినిమా ఎమోషనల్ గా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక ఈసినిమా హిట్ అవ్వడంతో చిత్రయూనిట్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా శర్వానంద్ మాట్లాడుతూ.. ఈ సినిమాను జనంలోకి తీసుకుని వెళ్లిన మీడియా మిత్రులకు ధన్యవాదాలు. నాలుగైదేళ్లుగా నాకు హిట్ లేదు .. హిట్ లేకపోతే ఎలా ఉంటుందనేది మీ అందరికీ తెలుసు. థియేటర్స్ లో ఈ సినిమాకి వస్తున్న రెస్పాన్స్ చూశాక హమ్మయ్య అనుకున్నాను. నా పక్కనున్న వాళ్లంతా ఈ సారి నేను సక్సెస్ కొట్టాలని అనుకున్నారు .. అక్కడే నేను సక్సెస్ అయ్యాను. శ్రీకార్తీక్ ఇలాంటి కథలు ఎప్పుడు రాసినా చేయడానికి రెడీగా ఉన్నాము. అమలగారి పాత్రకి అనూహ్యమైన రెస్పాన్స్ వస్తోంది. ఇకపై ఆమె వరుస సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చాడు.

కాగా ఈసినిమాలో రీతూ వ‌ర్మ‌ హీరోయిన్ గా న‌టిస్తుంది. వెన్నెల కిషోర్‌, ప్రియ‌ద‌ర్శి లతో పాటు.. ఈ సినిమాలో అక్కినేని అమ‌ల కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నాడు. డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై ఎస్ ఆర్ ప్ర‌కాశ్ బాబు, ఎస్ ఆర్ ప్ర‌భు నిర్మించారు. ఈ చిత్రానికి త‌రుణ్ భాస్క‌ర్ డైలాగ్స్ అందించగా.. సినిమాటోగ్రాఫర్‌గా సుజిత్ సారంగ్.. శ్రీజిత్ సారంగ్ ఎడిటర్‌గా పనిచేశారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 3 =