భారత చలన చిత్ర పరిశ్రమలో గర్వించ దగ్గ దర్శకులలో ఒకరుగా రాజమౌళి రాణిస్తున్న విషయం తెలిసిందే. సూపర్ హిట్ స్టూడెంట్ నెం 1 మూవీ తో దర్శకుడిగా కెరీర్ ప్రారంభించిన రాజమౌళి పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ డైరెక్టర్ గా మారారు. బ్లాక్ బస్టర్ బాహుబలి , బహుబలి2 మూవీస్ తో రాజమౌళి ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా సత్తాను చాటారు.బాహుబలి మూవీ తో పాన్ ఇండియా మూవీస్ కు రాజమౌళి నాంది పలికారు. ఆ మూవీలో నటించిన ప్రభాస్ మూవీస్ అన్నీ పాన్ ఇండియా మూవీస్ గా తెరకెక్కడం విశేషం. స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా తెరకెక్కిన హై ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ రౌద్రం రణం రుధిరం మూవీ మార్చి 25 వ తేదీ రిలీజ్ అయ్యి అన్ని భాషలలోనూ భారీ కలెక్షన్స్ సాధించిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ 1,130 కోట్ల రూపాయల కి పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఆర్ ఆర్ ఆర్ మూవీపై హాలీవుడ్ రైటర్స్ , డైరెక్టర్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా స్టార్ డైరెక్టర్ రాజమౌళి అరుదైన ఘనత ను సాధించారు. యూఎస్ లో జరిగే హాలీవుడ్ ప్రముఖ ఫిల్మ్ ఫెస్టివల్ బియాండ్ ఫెస్ట్ లో రాజమౌళి తెరకెక్కించిన కొన్ని సినిమాలు ప్రదర్శిస్తున్నారు. భారీ సంఖ్యలో ఆడియెన్స్ అటెండ్ అయ్యే ఈ ఫెస్ట్ లో ఆర్ ఆర్ ఆర్ , ఈగ , బాహుబలి , బహుబలి 2, ఈగ , మగధీర , మర్యాదరామన్న మూవీస్ ప్రదర్శించనున్నారు. ఈ మూవీస్ అన్నీ విశేష ప్రేక్షకాదరణ తో
భారీ కలెక్షన్స్ రాబట్టిన విషయం తెలిసిందే.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: