అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో వస్తున్న సినిమా బ్రహ్మాస్త్ర. ఈసినిమాలో రణబీర్ కపూర్, అలియా భట్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. మూడు పార్ట్ లుగా రిలీజ్ కాబోతున్న ఈసినిమా మొదటి పార్ట్ ను సెప్టెంబర్ 9వ తేదీన రిలీజ్ చేయబోతున్నారు. ఈసినిమా సౌత్ ప్రమోషన్స్ ను రాజమోళి నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే కదా. దీనిలో భాగంగానే ఈసినిమాను తనదైన శైలిలో ప్రమోట్ చేస్తున్నాడు. ఇక ఇప్పటికే ఈసినిమా విజన్ గురించి అయాన్ తెలియ చేయగా.. ఇప్పుడు తాజాగా రాజమౌళి సౌత్ లాంగ్వేజస్ లో బ్రహ్మాస్త్ర విజన్ ఏంటో తెలుపుతూ వీడియోలు రిలీజ్ చేశాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక వీడియోలో రాజమౌళి చెబుతూ.. అయాన్ ముఖర్జీని నేను కొత్తగా మీకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు.. తను తీసిన వేకప్ సిద్, ఏ జవానీ హై దివానీ సినిమాలు ఇండియన్ సినిమాల్లో సమ్ ఆఫ్ ద బ్లాక్ బస్టర్ ఫిలింస్. అయాన్ నన్ను 2016లో మొదటిసారి కలిశాడు.. అప్పుడు బ్రహ్మాస్త్ర కథ చెప్పాడు. అందులో నన్ను బాగా ఎగ్జైట్ చేసిన విషయం ఏంటంటే.. బ్రహ్మాస్త్రం హిందూ పురాణాల ఆధారంగా చేసుకొని రాసిన కథ అవ్వడం.. మన పురాణాలు,ఇతిహాసాల్లో ఉన్న శక్తులన్నింటిని కలిపి అస్త్రావర్స్ అని క్రియేట్ చేశాడు. అసలు అస్త్రావర్స్ అంటే ఏంటంటే.. మన శాస్త్రాల ప్రకారం మనిషి మనుగడకు మూల కారణం పంచ భూతాలు. అలాంటి పంచభూతాలను శాసించే శక్తి బ్రహ్మాశక్తి. బ్రహ్మాస్త్ర కథ ఆ బ్రహ్మా శక్తి నుండి పుట్టిన అస్త్రాల గురించి వాటిని ప్రయోగించే సూపర్ హీరోస్ గురించి.
ఉదాహరణకు వానరాస్త్రా.. మనకు తెలిసినట్టు చెప్పాలంటే ఒ అస్త్రాన్ని ఎవరైనా ధరిస్తే ఒక కింగ్ కాంగ్ కు ఉన్నంత బలం ఉంటుంది. అలానే నంది ఆస్త్రా.. వెయ్యి ఒంగోలు గిత్తలకు ఉండే శక్తి ఒకే మనిషిలో ఉంటే ఎలా ఉంటుందో ఆ అస్త్రాన్ని ధరించే వ్యక్తికి అంత బలం వస్తుంది. అగ్ని అస్త్ర ఒక ఫైర్ పవర్.. మంటలు, జ్వాలల్లో ఉండే పవర్ ఆ మంటల్ని హీరో తనకు అనుగుణంగా మలుచుకునే శక్తి ఉంటుంది. ఇలాంటి అస్త్రాలు ఇంకా చాలా ఉన్నాయి..ఇన్ని అస్త్రాలు.. వాటిని ఉపయోగించే సూపర్ హీరోలు.. వాళ్లమధ్య జరిగే వార్.. వీటన్నింటిని కలిసి విజువల్ ఎఫెక్ట్స్ ను ఉపయోగించి ఒక ఫెంటాస్టిక్ విజువల్ వండర్ గా క్రియేట్ చేశాడు అయాన్. వీటన్నింటి కన్నా ఇంకా శక్తివంతమైన అద్బుతమైన ఫోర్స్ ఒకటి ఉంది అదే ప్రేమ. ఇద్దరి మధ్యన ఉన్న ప్రేమ ఎలాంటి శక్తినైనా ఎదుర్కొగలదు అని ఈసినిమాలో చూపించాడు. ఇంకో హైలెట్ ఏంటంటే డిస్నీ సంస్థ మన ఇండియన్ సినిమాను ప్రపంచవ్యాప్తంగా భారీ రేంజ్ లో రిలీజ్ చేస్తుంది. బ్రహాస్త్ర సెప్టెంబర్ 9వ తేదీన రిలీజ్ అవుతుంది.. మిస్ అవ్వకుండా చూడండి అంటూ వీడియో ద్వారా తెలిపాడు.
కాగా సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈసినిమాలో రణ్‌బీర్‌కపూర్ శివ పాత్రలో నటిస్తుండగా అలియా ఇషా పాత్రలో కనిపించనుంది. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, అలానే నాగర్జున, మౌనిరాయ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను మూడు పార్టులుగా ధర్మ ప్రొడక్షన్స్, ఫాక్స్ స్టార్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈసినిమాకు ప్రీతమ్ సంగీతం అందిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: