హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “కె జి ఎఫ్ చాప్టర్ 1, చాప్టర్ 2 “మూవీస్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , శృతి హాసన్ జంటగా భారీ బడ్జెట్ తో తెలుగు , కన్నడ భాషలలో యాక్షన్ థ్రిల్లర్ “సలార్ “మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.“సలార్” మూవీ డార్క్ సెంట్రిక్ థీమ్ టెక్నాలజీ తో తెరకెక్కుతుంది. భారత చలన చిత్ర పరిశ్రమలో డార్క్ సెంట్రిక్ థీమ్ టెక్నాలజీ తో తెరకెక్కుతున్న మొదటి చిత్రంగా సలార్ మూవీ రికార్డ్ క్రియేట్ చేసింది .
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఫస్ట్ టైమ్ ప్రభాస్ , శృతి హాసన్ జంటగా నటిస్తున్న సలార్ మూవీలో మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు, ఈశ్వరీరావు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.అండర్ వరల్డ్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో వస్తున్న సలార్ మూవీ కొత్త షెడ్యూల్ సెప్టెంబర్ 4 వ తేదీ ప్రారంభం కానుందనీ , హీరో ప్రభాస్ షూటింగ్ లో జాయిన్ కానున్నారని సమాచారం. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న సలార్ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ తో పాటు హీరో ప్రభాస్ ప్రాజెక్ట్ K మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: