పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఎవర్ గ్రీన్ సినిమా ఏదంటే అందరికీ ఖుషి సినిమానే ముందు గుర్తొస్తుంది. ఎస్ జే సూర్య దర్శకత్వంలో వచ్చిన ఈసినిమా పవన్ కెరీర్ కే టర్నింగ్ పాయింట్ గా నిలిచింది. 2001 ఏప్రిల్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అప్పటికే వరుస విజయాలతో మంచి ఫామ్‌లో ఉన్న పవన్ స్థాయిని ఆకాశానికి ఎత్తేసిందిఇందులో పవన్ మ్యానరిజం, స్టైల్ అన్నీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మరి అలాంటి సినిమాను రీమేక్ చేయాలంటే చాలా కష్టం. అలాంటి ఆలోచన కూడా ఎవ్వరూ చేయరు. అయితే ఒకవేళ ఈసినిమాను రీమేక్ చేస్తే కనుక అది కేవలం పవన్ వల్ల మాత్రమే అవుతుందని అంటున్నాడు పవన్ మేనల్లుడు సాయి తేజ్. సాయితేజ్ తన తమ్ముడు వైష్ణవ్ తేజ్ నటిస్తున్న రంగ రంగ వైభవంగా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అతిథిగా వచ్చిన సంగతి తెలిసిందే కదా. మెగా హీరోలు సాయితేజ్, వరుణ్ తేజ్ ఇద్దరూ గెస్ట్ లుగా వచ్చారు. ఈసందర్భంగా ఈ ఈవెంట్ కు యాంకర్ గా వ్యవహరించిన సుమ పలు ప్రశ్నలు అడిగింది. వారిద్దరిని కాసేపు సరదాగా పలు ప్రశ్నలతో ఇంటర్వ్యూ చేసారు. అయితే అందులో భాగంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఖుషి మూవీ రీమేక్ చేయాలి అంటే మీలో ఎవరు చేస్తారు అంటూ సుమ ప్రశ్నించగా.. దానికి సాయి తేజ్.. నిజానికి ఆ మూవీ ఒక పవర్ఫుల్ ఎంటర్టైనర్, ఆ మూవీ రీమేక్ తో పాటు అందులోని సిద్దు పాత్ర చేయగల సత్తా వన్ అండ్ ఓన్లీ పవర్ స్టార్ కి మాత్రమే ఉందని అన్నారు సాయి తేజ్.
కాగా గిరీశయ దర్శకత్వంలో రంగ రంగ వైభవంగా సినిమా తెరకెక్కుతుంది. ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌లో కేతికా శర్మ హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా ప్రభు, నరేష్, సుబ్బరాజు, తులసి, ప్రగతి, నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: