సౌత్-నార్త్ మూవీస్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Anupam Kher Interesting comments About South And North Movies,Telugu Filmnagar,Telugu Film News 2022,Tollywood Latest,Tollywood Movie Updates,Latest Telugu Movies News,Anupam Kher, Bollywood Actor Anupam Kher,Bollywood Senior Actor Anupam Kher, Anupam Kher About South And North Movies, Anupam Kher Interesting Comments aboout South and North Movies, Anupam Kher latest Movie Updates, Anupam Kher New Movie Updates, Anupam Kher Comments on South and North Movies

సినీ పరిశ్రమల్లో పరిస్థితులు ఎలా మారిపోయాయో చూస్తున్నాం. ఒకప్పుడు ఒక పరిశ్రమలోని నటీనటులు వేరే ఇండస్ట్రీల్లో చేసేవారు కానీ చాలా తక్కువ ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు.. ఇండస్ట్రీలకు సరిహద్దులు చెరిగిపోయాయి. ఎవరికి ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ అవకాశాలను అందుకుంటూ వెళుతున్నారు. తెలుగు డైరెక్టర్లు హిందీలో చేస్తున్నారు.. తమిళ్ హీరోలు తెలుగులో చేస్తున్నారు.. తెలుగు హీరోలు తమిళ్-హిందీల్లో చేసుకుంటున్నారు. మరోవైపు సౌత్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయాలను అందుకుంటున్నాయి. ఒకవైపు బాలీవుడ్ ఇండస్ట్రీ హిట్లు కోసం ఎదురుచూస్తుంటే మరోవైపు.. దేశవ్యాప్తంగా సౌత్ సినిమాల మార్కెట్ ఇప్పుడు సాలిడ్ గా ఉంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఇప్పటికే సౌత్-నార్త్ సినిమాలపై పలువురు పలు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. దీనిపై వివాదాలు కూడా మొదలయ్యాయి. ఇక ఇప్పుడు మరో సీనియర్ హీరో చేసిన వ్యాఖ్యలు కూడా హాట్ టాపిక్ గా మారాయి. బాలీవుడ్ సీనియర్ హీరో అనుపమ్ ఖేర్ తన సినీ ప్రయాణంలో ఎన్నో సినిమాలు చేశారు. ఇక కార్తికేయ2 ద్వారా సౌత్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. చందూ మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా వచ్చిన సినిమా కార్తికేయ2. కార్తికేయ2 మంచి విజయం సాధిస్తూ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. నార్త్ లో కూడా సాలిడ్ గా హవా సాగిస్తుంది. దీంతో చిత్రయూనిట్ సక్సెస్ సెలబ్రేషన్స్ ను చేసుకున్నారు.

ఈ సందర్భంగా అనుప‌మ్ ఖేర్‌ మాట్లాడుతూ.. ఈ సినిమాలో తను లార్డ్ కృష్ణ గొప్ప‌త‌నాన్ని వివ‌రించే చిన్న స‌న్నివేశం ప్రేక్ష‌కుల‌కు గూస్ బంప్స్ తెప్పించేలా సాగుతుందని అన్నారు. ఇంకా నార్త్ వ‌ర్సెస్ సౌత్ అంశంపై అనుప‌మ్ ఖేర్ స్పందిస్తూ.. సౌత్ లో క‌థ‌కు ఎక్కువ ప్రాధాన్య‌త ఇస్తూ సినిమాలు చేస్తుంటే…హిందీ ఫిల్మ్ మేక‌ర్స్ మాత్రం ప్రాథ‌మిక క‌థాంశంపై ఫోక‌స్ పెట్ట‌కుండా యాక్ట‌ర్ల ఇమేజ్‌పై దృష్టి పెడుతున్నార‌ని చెప్పుకొచ్చారు. ఇప్పుడు అనుపమ్ ఖేర్ వ్యాఖ్యలు టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా మారాయి. మ‌రి దీనిపై బాలీవుడ్ నుండి ఎలాంటి రియాక్ష‌న్ ఉంటుందో చూడాలి.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 − 2 =