మీరు చూపిస్తున్న ప్రేమ రూ.100 కోట్లతో సమానం- నిఖిల్

Nikhil Emotional Speech at Karthikeya 2 100 Crores Celebrations,Telugu Filmnagar,Telugu Film News 2022,Tollywood Latest,Tollywood Movie Updates,Latest Telugu Movies News,Karthikeya 2,Karthikeya 2 Movie,Karthikeya 2 Telugu Movie,Karthikeya 2 Movie Collections,Karthikeya 2 Collections Updates,Karthikeya 2 100 Crores Celebrations,Karthikeya 2 Movie latest 100 Crores Celebrations,Nikhil Siddhartha Karthikeya 2 Movie 100 Crores Celebrations,Nikhil Emotional Speech in Karthikeya 2 Movie,Nikhil Upcoming Movies,Nikhil About Karthikeya 2

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా సూపర్ హిట్ థ్రిల్లింగ్ మిస్టరీ కార్తికేయ మూవీ కి సీక్వెల్ గా తెరకెక్కిన కార్తికేయ 2 మూవీ ఆగస్ట్ 13 వ తేదీ తెలుగు , హిందీ భాషలలో భారీ అంచనాలతో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో , భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ కథానాయిక. బాలీవుడ్ యాక్టర్ అనుపమ్ ఖేర్ కీలక పాత్ర లో నటించారు. రావు రమేష్ , తనికెళ్ళ భరణి ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ కి కాలభైరవ సంగీతం అందించారు.హీరో నిఖిల్ , హీరోయిన్ అనుపమ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన కార్తికేయ 2 మూవీ 3 రోజులలో బ్రేక్ ఈవెన్ సాధించింది. ఓవర్ సీస్ తో పాటు , నార్త్ లో కూడా ఈ మూవీ అద్భుత రెస్పాన్స్ అందుకుంటుంది.తాజాగా కార్తికేయ2 రూ. 100 కోట్ల క్లబ్ లో చేరిపోయింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కార్తికేయ 2 మూవీ వంద కోట్ల క్లబ్‌లో చేరిన సందర్భంగా చిత్రబృందం కర్నూలులో విజయోత్సవ సభను ఏర్పాటు చేసింది. ఆ వేడుకలో హీరో నిఖిల్ మాట్లాడుతూ … బాహుబలి, పుష్ప, ఆర్ఆర్ఆర్ చిత్రాలతో ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్ తెలుగు సినిమా సత్తా ఏంటో ప్రపంచానికి చూపించారనీ , కార్తికేయ 2 హిందీలో డబ్ అయి ఉత్తరాదిన విడుదలవుతుందంటే భయమేసిందనీ , నిఖిల్ ఏంటి బాలీవుడ్‌కు వెళ్లడమేంటని మీరూ అనుకున్నారు కదా, కానీ విడుదలయ్యాక పరిస్థితి మారిందనీ , దేశవ్యాప్తంగా ఈ సినిమా 1200 స్క్రీన్లలో ప్రదర్శితమవుతోందనీ ,ఇది కార్తికేయ 2 విజయం కాదు.. తెలుగు సినిమా విజయంఅనీ , సినిమా అంటే బాక్సాఫీస్ నెంబర్లు కాదనీ , ఓ ఎమోషన్అనీ , మీరు చూపిస్తున్న ప్రేమే తనకు రూ.100 కోట్లతో సమానమనీ చెప్పారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 1 =