ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో అగ్ర హీరో నాగార్జున ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా ది ఘోస్ట్. యాక్షన్ థ్రిల్లర్ గా ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకునే ఉంది. ప్రవీణ్ సత్తారు తెరెక్కిస్తుండటంతో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఈసినిమా అక్టోబర్ 5వ తేదీన రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ఇప్పటినుండే ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టారు చిత్రయూనిట్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్, పోస్టర్లు ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి. ఇక తాజాగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా ఈ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇక ట్రైలర్ కూడా ఆకట్టుకుంటుంది. నాగ్ యాక్షన్ సన్నీవేశాలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటున్నాయి. ట్రైలర్ అయితే సినిమా అంచనాలను పెంచేస్తుంది.
Glad to launch the intense & gripping trailer of #TheGhost! Wishing @iamnagarjuna and the entire team all the very best!https://t.co/b57WJ44lEY@PraveenSattaru @sonalchauhan7 @nseplofficial @SVCLLP @AsianSuniel
— Mahesh Babu (@urstrulyMahesh) August 25, 2022
కాగా ఈసినిమాలో సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో నాగార్జున, సోనాల్ చౌహాన్ ఇద్దరూ ఇంటర్‌పోల్ ఆఫీసర్స్‌గా కనిపించనున్నట్టు తెలుస్తుంది. ఇక ఈసినిమాలో గుల్‌పనాగ్, అనిఖ సురేంద్రన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వెంకటేశ్వర సినిమాస్, నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: