సెప్టెంబర్1 నుండి షూటింగ్స్ పునఃప్రారంభం

Telugu Film Shootings to Resume From September 1st,Dil Raju And Other Producers Resolve Tollywood Issues – Shootings Resume From September 1st,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Latest, Tollywood Movie Updates,Ace Producer Dil Raju,Dil Raju,Tollywood Producers,Telugu Movie Producers,Ticket Prices,OTT Releases,Workers’ Wages,Artists’ Remunerations, Production Costs,Federation Issues,Dil Raju on Multiple Issues,Dil Raju and Other Producers Resloved the Issues in Tollywood,Tollywood Shooting Resumes From September 1st, Telugu Movie Shootings will Resume From 1st September,Dil Raju Latest Movie updates,Dil Raju New Movie Updates,Dil Raju About Tollywood Issues,Dil Raju Resolve Tollywood Issues

ఈమధ్య ఇండస్ట్రీలో పలు సమస్యలవల్ల ఇబ్బందులు తలెత్తిన సంగతి తెలిసిందే కదా. టికెట్ రేట్ల దగ్గర నుండి పలు సమస్యలపై నిర్మాతల మండలి గతకొద్దిరోజులుగా చర్చలు జరుపుతూ వస్తుంది. టికెట్ రేట్లు, ఓటీటీల రిలీజ్ లు, థియేటర్లలో లభించే తినుబండారాల రేట్ల దగ్గరి నుంచి ప్రొడక్షన్ కాస్ట్.. సెలబ్రిటీల రెమ్యూనరేషన్ వరకూ అన్నింటిపైనా చర్చించిన ప్రొడ్యూసర్స్ వాటిపై ఓ నిర్ణయానికి వచ్చారు. థియేటర్‌లో రిలీజైన 8 వారాల తర్వాతే సినిమాలు ఓటీటీలో రిలీజ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇంకా థియేటర్‌, మల్టీప్లెక్స్‌లలో తినుబండారాల ధరల విషయంలో థియేటర్ల యాజమాన్యాలతో మాట్లాడామనీ , తినుబండారాల ధరలు ప్రేక్షకులకు అందుబాటులో ఉండేలా చూసుకుంటామని వారు హామీ ఇచ్చారని తెలిపారు. ఇంకా మల్టీప్లెక్స్‌, సింగిల్‌స్క్రీన్స్‌లో టికెట్‌ ధరలు తగ్గించడానికి కూడా అంగీకరించారని దిల్ రాజు ఇప్పటికే తెలిపారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈకారణంగా షూటింగ్ లు కూడా నిలిపివేసిన సంగతి కూడా తెలిసిందే. అన్ని సమస్యలు ఓ కొలిక్కి వచ్చాకే షూటింగ్స్ మొదలుపెట్టాలని నిర్మాతల మండలి నిర్ణయం తీసుకుంది. విదేశాలలో షూటింగ్‌ జరుపుకునే సినిమాలు.. పెండింగ్ వర్క్ లు మధ్యలో ఆగిపోయిన సినిమాలన్నీ ఆగష్ట్ 25నుంచే మొదలు పెట్టుకోవచ్చని.. ఇక సెప్టెంబర్ 1 నుంచి మిగిలిన వారందరూ షూటింగ్‌ స్టార్ట్ చేసుకోవచ్చని గిల్డ్ సభ్యులు వెల్లడించారు.

మరి గత కొద్దిరోజులుగా షూటింగ్స్ లేక కళ తప్పిన ఇండస్ట్రీకి జీవం వచ్చినట్టైంది. ఇక ఈలోపు చాలా సినిమాలు పూజా కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకొని షూటింగ్ లకు రెడీ గా ఉన్నాయి. ఇక ఈ నెలలో వచ్చిన మూడు సినిమాలు కాస్త ఊరట నివ్వడంతో అందరూ తమ సినిమాలపై కూడా ఆసక్తితో ఉన్నారు. మరి చూద్దాం వచ్చే నెల రిలీజ్ కు చాాలా సినిమాలు ఉన్నాయి. ఎన్ని సినిమాలు హిట్ అందుకుంటాయో.. ఎన్నిఫట్ అవుతాయో.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × one =