బిజినెస్ మేన్ రీమేక్ పై పూరీ

Puri Jagannadh about Businessman Remake,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Filmnews 2022, Tollywood Latest Movies,Tollywood Movie Updates,Puri Jagannadh,Director Puri Jagannadh,Ace Director Puri Jagannadh, Puri Jagannadh Upcoming Movies,Puri Jagannadh About Businessman Movie Remake,Puri Jagannadh and Mahesh Babu Blockbuster Movie Businessman, Businessman Movie Updates,Businessman Movie,Businessman Telugu Movie,Puri Jagannadh Remake of Businessman, Liger Movie udpates,Puri Jagannadh Liger Movie Latest Updates,Vijay Deverakonda Movie Updates,Vijay Deverakonda and Puri Jagannadh Upcoming Movie Liger Movie, Liger Telugu Movie

టాలీవుడ్ డైరెక్టర్ లలో డాషింగ్ డైరెక్టర్ పూరీ కాంబినేషన్ లో కూడా చేయాలని ప్రతి ఒక్క హీరో అనుకుంటాడు. పూరీ మేకింగ్ కు చాలా మంది ఫిదా అవుతారు. అయితే ఆమధ్య కాస్త డల్ అయిన పూరీ ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. ప్రస్తుతం అయితే విజయ్ దేవరకొండ తో చేసిన లైగర్ సినిమాను రిలీజ్ కు సిద్దంగా ఉంటాడు. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈసినిమా ఈనెల 25న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న క్రేజీ సినిమా కాబట్టి ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే టీజర్, ట్రైలర్, పాటలు మంచి బజ్ ను క్రియేట్ చేశాయి. చూడబోతే ఈసినిమాతో కూడా పూరీ మరో హిట్ ను తన ఖాతాలో వేసుకునేలా కనిపిస్తున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఈనేపథ్యంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పూరీ తనకు బిజినెస్ మేన్ సినిమాను రీమేక్ చేయాలన్న కోరిక ఉందని తెలిపాడు. అది కూడా మహేష్ తోనే హిందీలో రీమేక్ చేయాలని ఉందని తెలిపాడు. బిజినెస్ మేన్ డైలాగ్ బేస్డ్ సినిమా హీరో పాత్రకు చాలా స్కోప్ ఉంటుంది.. అంతేకాదు నార్త్ లో ఈసినిమా వర్కవుట్ అవుతుందన్న నమ్మకం ఉందని అన్నాడు. రీమేక్ తో పాటు బిజినెస్ మేన్ ఫ్రాంచైజీస్ కూడా తీయాలన్నకోరిక ఉంది..పోకిరి సినిమాకు కూడా అదే ఐడియా ఉందని తెలిపాడు. చూద్దాం మరి ఫ్యూచర్ లో పూరీ కోరిక తీరే ఛాన్స్ వస్తుందేమో.

కాగా పూరీ జగన్నాథ్- మహేష్ బాబు కాంబినేషన్ లో పోకిరి, బిజినెస్ మేన్ సినిమాలు రాగా రెండు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్నాయి. ఆ తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ సినిమా జనగణమన సినిమా వస్తుంది అనుకున్నారు కానీ మహేష్-పూరీ వేరే ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండటంతో ఆ సినిమా కాస్త వెనక్కి వెళ్లిపోయింది. ఇక మహేష్ తో చేయాల్సిన సినిమాను పూరీ ఇప్పుడు విజయ్ దేవరకొండతో చేస్తున్నాడు.

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × four =