శ్రీ సూర్య మూవీస్ బ్యానర్ పై శంకర్. ఎస్ దర్శకత్వంలో కమల్ హాసన్ కథానాయకుడిగా తెరకెక్కిన ఇండియన్ (భారతీయుడు )తమిళ మూవీ 1996 మే 9 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ద్విపాత్రాభినయం లో కమల్ హాసన్ పెర్ఫార్మ్ చేసిన ఈ మూవీ లో సుకన్య , మనీషా కొయిరాలా కథానాయికలు. ఈ మూవీ లో తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరో కమల్ హాసన్ బెస్ట్ యాక్టర్ గా నేషనల్ , ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు. ఇండియన్ (భారతీయుడు )తమిళ మూవీ సీక్వెల్ ఇండియన్ 2 మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Universal Hero @ikamalhaasan & Ace Director @shankarshanmugh ‘s #INDIAN2 🇮🇳 Shoot Resumes Today 🎥💥@LycaProductions @Udhaystalin @RedGiantMovies_ @anirudhofficial #Siddharth @MsKajalAggarwal @Rakulpreet @priya_Bshankar @dop_ravivarman @sreekar_prasad @muthurajthangvl pic.twitter.com/8NZ5WNS3X5
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) August 24, 2022
లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై శంకర్. ఎస్ దర్శకత్వంలో కమల్ హాసన్ కథానాయకుడిగా ఇండియన్ 2 మూవీ షూటింగ్ 2019 జనవరి లో ప్రారంభం అయ్యింది. కాజల్ అగర్వాల్ , రకుల్ ప్రీత్ , ప్రియా భవానీ శంకర్ కథానాయికలు. సిద్ధార్ధ్ , సముద్ర ఖని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. మూడు షూటింగ్ షెడ్యూల్స్ జరుపుకున్న ఇండియన్ 2 మూవీ షూటింగ్ అనేక కారణాలతో నిలిచిపోయింది. హీరో కమల్ హాసన్ వేరే మూవీస్ తో బిజీగా ఉండటం , షూటింగ్ సెట్ లో ప్రమాదం , కరోనా వంటి వాటితో నిలిచిపోయిన ఇండియన్ 2 మూవీ షూటింగ్ నిన్న చెన్నై లో ప్రారంభం అయ్యిందని దర్శకుడు శంకర్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: